హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ రూ. 15వేల కోట్ల పెట్టుబడి..!

హైదరాబాద్ ప్రపంచ డేటా హబ్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ డెలవప్‌మెంట్ సెంటర్ పెట్టిన తర్వాత… ఎలా అయితే.. సాఫ్ట్‌వేర్ సిటీగా మారిందో.. ఇప్పుడు.. ఏదే తరహాలో.. మైక్రోసాఫ్ట్.. డేటా సెంటర్ రాబోతోంది. ఏకంగా రూ. పదిహేను వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్‌తో చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ సర్కార్ భూమిని .. మైక్రోసాఫ్ట్ కంపెనీకి చూపించింది. ఆ భూమి.. ప్రభుత్వం కల్పిస్తామని హామీ ఇచ్చిన సౌకర్యాల పట్ల… మైక్రోసాఫ్ట్ సంతృప్తి చెందింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో డేటా సెంటర్ పెట్టాలని ఇప్పటికే అదానీ గ్రూప్ నిర్ణయించింది. హైదరాబాద్‌లో 13 బిలియన్ డాలర్ల వ్యయంతో డేటా సెంటర్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే దాదాపుగా రూ. 90వేల కోట్లు. అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్‌ కోసం శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన డిజిటల్ రియాల్టీతో జత కడుతున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. డేటా రంగంలో ఉన్న మరికొన్ని ప్రధానమైన కంపెనీలచూపు కూడా హైదరాబాద్ వైపు ఉన్నట్లుగా చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్.. డేటా సెంటర్.. హైదరాబాద్‌లో ఏర్పాటయితే.. తెలంగాణ ఐటీ రంగానికి మరింత ఊపు వస్తుంది.

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా తెలుగు తేజం సత్య నాదెళ్ల ఉన్నారు. ఆయన ఇండియాకు వచ్చిన సమయంలో… ఒకటి రెండు సార్లు తెలంగాణ ప్రభుత్వ పెద్దలను కలిశారు. బహుశా..ఈ డేటా సెంటర్ గురించి చర్చించడానికే అయి ఉంటుందని అంచనావేస్తున్నారు. అయితే.. మైక్రోసాఫ్ట్.. ఏ విషయమైనా.. పూర్తి స్థాయిలో.. ఒప్పందాలు పూర్తయిన తర్వాతనే వెల్లడిస్తుంది. మైక్రోసాఫ్ట్ వేపు నుంచి అధికారిక ప్రకటన కోసం కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close