న‌రేష్ కాదు… న‌వీన్ చంద్ర‌

చిన్న చిన్న పాత్ర‌లనైనా – పెద్ద న‌టుల‌తో చేయించ‌డం బోయ‌పాటికి అల‌వాటు. అప్పుడే తెర నిండుగా క‌నిపిస్తుంద‌ని ఆయ‌న న‌మ్మ‌కం. అందుకే.. బోయ‌పాటి సినిమాల్లో ఫ్రేము ప‌ట్ట‌నంత మంది న‌టీన‌టులు క‌నిపిస్తారు. ఈసారీ అదే పంథాలో వెళ్తున్నారాయ‌న‌. బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోనూ న‌టీన‌టుల ఎంపిక ప‌రంగా చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు బోయ‌పాటి. ఓ పాత్ర కోసం అల్ల‌రి న‌రేష్ ని సంప్ర‌దించిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి.

కాక‌పోతే.. న‌రేష్ స‌న్నిహిత వ‌ర్గాలు మాత్రం ఈ వార్త‌ని ఖండించాయి. ”బోయపాటి మైండ్ లో ఏముందో తెలీదు. కానీ.. ఈ ఆఫ‌ర్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కూ న‌రేష్ తో చ‌ర్చించ‌లేదు” అని న‌రేష్ పీఆర్ టీమ్ తెలిపింది. ఓ పాత్ర కోసం ఇది వ‌ర‌కే.. బోయ‌పాటి న‌వీన్ చంద్ర‌ని ఎంచుకున్నారు. ఆ పాత్ర కోసం మ‌రిన్ని ఆప్ష‌న్లు వెదికే క్ర‌మంలో న‌రేష్ పేరు చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని, అయితే బోయ‌పాటి చివ‌రికి న‌వీన్ చంద్ర కే ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. కాబ‌ట్టి బాల‌య్య సినిమాలో న‌రేష్ ఓ ఆప్ష‌న్ మాత్ర‌మే. ఈ పాత్ర కోసం న‌వీన్ చంద్ర ఇప్ప‌టికే ఫిక్స్ అయిపోయాడు. సో.. ఇందులో న‌రేష్ లేన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 నుంచి రజనీకాంత్ ఔట్

టీవీ9 నుంచి రజనీకాంత్ నిష్క్రమించారు. తెలుగులో నెంబర్ వన్ చానల్‌గా ఉన్న టీవీ9లో కొద్దిరోజులుగా గ్రూపుల గలాటా సాగుతోంది.రజనీకాంత్, మురళీకృష్ణల మధ్య సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయారు. కొత్త యాజమాన్యం చేతుల్లోకి వచ్చిన...

అమరావతికి మద్దతుగా హైకోర్టులో జనసేన అఫిడవిట్..!

అమరావతి విషయంలో జనసేన పార్టీ తన విధానాన్ని నేరుగా హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియ చేసింది. మూడు రాజధానులు వద్దే వద్దని అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని సూటిగా జనసేన స్పష్టం చేసింది....

బ్యాటన్ అందుకున్న రోజా ..! పెద్ద ప్లానే..!?

హిందూత్వాన్ని కించ పరుస్తున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు. వివాదాన్ని అంతకంతకూ పెద్దగి చేసుకుంటూ వెళ్తున్నారు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకరిని మించి మరొకరు...

మోడీ భార్యతో కలిసి పూజలు చేసిన తర్వాతే జగన్‌ను అడగాలి : కొడాలి నాని

భారతీయ జనతా పార్టీపైనా మంత్రి కొడాలి నాని తన టెంపర్ చూపించారు. ప్రధాని మోడీ ముందు తన భార్యను రామాలయనికి తీసుకెళ్లి సతీసమేతంగా పూజలు చేయాలని ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి కుటుంబసమేతంగా...

HOT NEWS

[X] Close
[X] Close