ఆర్.ఎక్స్ 100 నిర్మాత అరెస్ట్‌

బుల్లి తెర న‌టి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వాళ్ల‌లో `ఆర్‌.ఎక్స్ 100` నిర్మాత అశోక్ రెడ్డి ఒక‌రు. ఈకేసు పూర్వాప‌రాల‌ను ప‌రిశీలించిన పోలీసులు, లోతుగా ద‌ర్యాప్తు చేసి అశోక్ రెడ్డిని ఏ 2గా గుర్తించారు. సోమ‌వారం పోలీసులు ముందు హాజ‌రు కావ‌ల్సిన అశోక్ రెడ్డి… ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎట్ట‌కేల‌కు పోలీసులు అశోక్‌రెడ్డిని అదుపులో తీసుకున్నారు. ప్ర‌స్తుతం వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈసాయింత్రంలోగా కోర్టులో హాజ‌రు ప‌రిచి, రిమాండుకి త‌ర‌లించే అవ‌కాశం ఉంది.

సాయిరెడ్డి, దేవ‌రాజ్ రెడ్డి, అశోక్ రెడ్డి వేధింపుల వ‌ల్లే… శ్రావ‌ణి ఆత్మహ‌త్య చేసుకుంద‌ని పోలీసులు త‌మ ద‌ర్యాప్తులో తేల్చారు. సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తానంటూ అశోక్ రెడ్డి శ్రావ‌ణికి ద‌గ్గ‌ర‌య్యాడ‌ని, అయితే అప్ప‌టికే శ్రావ‌ణి.. దేవరాజ్‌ని ప్రేమిచింద‌ని, దేవ‌రాజ్‌ని అడ్డుతొల‌గించుకోవాల‌ని సాయి, అశోక్ రెడ్డి ప‌థ‌కం ప‌న్నార‌ని, అయితే ఎంత చెప్పినా శ్రావ‌ణి దేవ‌రాజ్‌కి దూరం కాక‌పోయేస‌రికి.. శ్రావ‌ణికి అశోక్ రెడ్డి, సాయిరెడ్డి క‌లిసి మాన‌సికంగా వేధించార‌ని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిక కాల్ రికార్డులు, ఇత‌ర ఆధారాలు పోలీసులు సేక‌రించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బ్యాటన్ అందుకున్న రోజా ..! పెద్ద ప్లానే..!?

హిందూత్వాన్ని కించ పరుస్తున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు మాత్రం తగ్గడం లేదు. వివాదాన్ని అంతకంతకూ పెద్దగి చేసుకుంటూ వెళ్తున్నారు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలతో ఒకరిని మించి మరొకరు...

మోడీ భార్యతో కలిసి పూజలు చేసిన తర్వాతే జగన్‌ను అడగాలి : కొడాలి నాని

భారతీయ జనతా పార్టీపైనా మంత్రి కొడాలి నాని తన టెంపర్ చూపించారు. ప్రధాని మోడీ ముందు తన భార్యను రామాలయనికి తీసుకెళ్లి సతీసమేతంగా పూజలు చేయాలని ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి కుటుంబసమేతంగా...

నమ్రత విషయంలో మీడియా తొందరపడిందా ?

సోషల్ మీడియా వచ్చిన తర్వాత వార్త వైరస్ కంటే వేగంగా వ్యాపించేస్తుంది. ఏదైనా సంఘటన జరిగితే చాలు.. పూర్తి వివరాలు తెలుసుకోకుండానే వార్తలు ఇచ్చేయడం అలావాటైపోయింది. ఇది ఎంత దారుణంగా తయారైయిందంటే .....

మీడియా వాచ్: బిల్ గేట్స్ తో తెలుగు ఛానల్ సీఈవో

గ్లోబల్ బిజినెస్ సమ్మిట్- 2020 కు సర్వం సిద్ధమైయింది. కరోనా నేపధ్యంలో వర్చువల్ గా జరగనున్న ఈ సమావేశంలో ప్రపంచ ప్రఖ్యాత బిల్ గేట్స్ తో కలిసి ప్రపంచ వ్యాపార వేదిక పై...

HOT NEWS

[X] Close
[X] Close