పవన్ కల్యాణ్ కొత్త సినిమా దసరా రోజున కొబ్బరికాయ్ కొట్టుకొంది. ఈ వేదాళం రీమేక్‌కి నేసన్ దర్శకుడు. ఏఎం రత్నం నిర్మాత. ఇప్పుడు కథానాయిక కూడా ఫిక్సయిపోయిందని లేటెస్ట్ టాలీవుడ్ టాక్. పవన్ కల్యాణ్ సరసన నయనతారని ఎంచుకొన్నట్టు చెబుతున్నారు. మరో కథానాయికకీ చోటుందని, ఆమె పేరు త్వరలో ఖరారు చేస్తారని సమాచారం. అయితే పవన్ – నయన కాంబో నమ్మబుల్‌గా లేదని పవన్ కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. నయనతార విషయంలో టాలీవుడ్ ఆచి తూచి స్పందిస్తోందని, ఆమెను ఎవాయిడ్ చేయాలని తెలుగు నిర్మాతలంతా ఫిక్సయ్యారని గుసగుసలాడుకొంటున్నారు. నయన కూడా టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేయాలని చూస్తోందని, టాలీవుడ్ నుంచి నయనకు అవకాశాలు వెళ్లినా ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దాన్ని బట్టి పవన్ – నయనల కాంబో ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట.
చిత్ర బృందం కూడా ”కథానాయిక విషయంలో అప్పుడే తొందరేం వచ్చింది..?డిసెంబరులో ఈ సినిమా మొదలవుతుంది. కథానాయిక ఎవరో అప్పుడే చెబుతాం” అంటోంది. అయితే పవన్ అభిమానులకు సంబంధించినంత వరకూ ఓ స్వీట్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా టైటిల్ ఖరారు అయిపోయిందట. ఆ టైటిల్‌ని పవనే స్వయంగా పెట్టాడట. ఒకట్రెండు రోజుల్లో ఛాంబర్లో ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించమని, అప్పటి వరకూ గోప్యంగా ఉంచమన్నట్టు పవన్ చిత్రబృందాన్ని సూచించడాడట. దీపావళి లోగా పవన్ సినిమా టైటిల్ ఏంటో బయటకు తెలిసే అవకాశం ఉంది.