ఎన్టీఆర్ స్థాయి చరణ్, బాలకృష్ణలకు లేదా?

ఒకప్పుడు సినిమా బాగుందా? లేదా? అని పోల్చిచూసేవారు. ఏ హీరో బాగా యాక్ట్ చేస్తున్నాడు అని మాత్రమే చర్చించుకునేవారు. ఆ తర్వాత థియేటర్స్ సంఖ్య ప్రామాణికమైపోయింది. ఏ సినిమా ఎన్ని ఎక్కువ థియేటర్స్‌లో ఆడింది? 50 రోజుల థియేటర్స్ ఎన్ని? 100 రోజల థియేటర్స్ ఎన్ని? అని డిస్కస్ చేసి నంబర్ ఒన్ హిట్‌ని, హీరో క్రేజ్‌ని డిసైడ్ చేసేసేవారు. కానీ ప్రస్తుతం మాత్రం వ్యవహారమంతా కూడా కలెక్షన్స్ లెక్కల్లోకి వచ్చేసింది. అలాగే సోషల్ మీడియా ట్రెండింగ్ కూడా ప్రామాణికమైపోయింది. సోషల్ మీడియా ట్రెండింగ్, హిట్స్‌ని బేస్ చేసుకుని చూస్తే మాత్రం రామ్ చరణ్, బాలకృష్ణలు ఎన్టీఆర్‌ని బీట్ చేయలేకపోయారు అని చెప్పొచ్చు. యూట్యూబ్‌లో విడుదలైన ఆరుగంటల్లోనే జనతా గ్యారేజ్ సినిమా టీజర్ మిలియన్ మార్క్ హిట్స్‌ని క్రాస్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ధృవ టీజర్ కానీ, అలాగే బాలయ్యబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కానీ జనతా టీజర్ రికార్డ్‌ని టచ్ చేయలేకపోయాయి.

రికార్డ్‌ల విషయం పక్కన పెట్టినా ధృవ, గౌతమీ పుత్ర శాతకర్ణి టీజర్స్‌కి ఆడియన్స్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ అయితే మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేవు. ధృవ టీజర్ మేకింగ్ చాలా స్టైలిష్‌గా ఉంది. టెక్నికల్‌గా అద్భుతం అంటున్నారు. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఇక గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా మేకింగ్‌ పైనే బోలెడన్ని సందేహాలు వస్తున్నాయి. భారీ స్థాయిలో, చాలా ఎక్కువ టైం తీసుకుని, చాలా శ్రధ్ధగా తెరకెక్కించాల్సిన మన తెలుగు వీరుడి కథను బాలకృష్ణ సంక్రాంతి సెంటిమెంట్‌ని దృష్టిలో పెట్టుకుని, సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న తొందరలో త్వరత్వరగా చుట్టేస్తున్నారేమోనని అనిపిస్తోంది. గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్, టీజర్‌లు బాలయ్య అభిమానులకు నచ్చాయోమో కానీ సాధారణ ప్రేక్షకుల నుంచి మాత్రం విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ విషయం ఎలా ఉన్నా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా అద్భుతంగా తెరకెక్కాలని చాలా మంది తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తెలుగు వాళ్ళకు తెలియని తెలుగు చక్రవర్తి కథను క్రిష్ ఏ స్థాయిలో తెరెక్కిస్తాడో? ఏ రేంజ్‌లో మనల్ని మెప్పిస్తాడో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close