బాల‌య్య రెండో లుక్ ఎలా ఉంటుందో..?

బాల‌య్య మంచి స్పీడుమీదున్నాడు. త‌న 105వ సినిమాని చ‌క చ‌క పూర్తి చేస్తున్నాడు. న‌వంబ‌ర్ నాటిక‌ల్లా ఫ‌స్ట్ కాపీ రెడీ చేయాల‌న్న‌ది బాల‌య్య ప్లాన్‌. ఆ త‌ర‌వాత బోయ‌పాటి సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లాలి. 105వ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్లు కూడా మొద‌లెట్టేశారు. ఇందులో బాలయ్య గెట‌ప్‌ని రివీల్ చేసేశారు. ఈరోజు మ‌రో లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమాలో బాల‌య్య పాత్ర రెండు పార్శ్వాలలో క‌నిపించబోతోంది. యంగ్ లుక్ ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది కాక మ‌రో లుక్ ఉంది. అది ఎలా ఉంటుందా?  అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ లుక్‌లో బాల‌య్య మ‌రింత కొత్త‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. బాల‌య్య‌కు లుక్స్ అంటే పిచ్చి. త‌న సినిమాల్లో రెండు మూడు గెట‌ప్పులు ఉంటాయి. రెండో గెట‌ప్‌లో బాల‌య్య ఓ సాధార‌ణ వ్య‌క్తిలా క‌నిపించ‌బోతున్నాడ‌ని, ఈ క‌థ‌లో ఎమోష‌న్ పార్ట్ అంతా ఆ లుక్‌పైనే సాగ‌బోతోంద‌ని టాక్‌. ఈ సినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కూ చెప్ప‌లేదు. `రూల‌ర్‌` అనే పేరు మాత్రం చ‌ర్చ‌ల్లో ఉంది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేరళ ఎయిర్‌పోర్టులో విమానం రెండు ముక్కలు..!

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో..విమానం స్కిడ్ అయి రెండు ముక్కలు అయింది. ఓ ముక్క చాలా దూరంగా పడిపోయింది. మరో ముక్క రన్ వే పై ఉండిపోయింది....

రికవరీ తక్కువ.. మృతులు ఎక్కువ..! ఏపీలో “డెడ్లీ” కరోనా..!

ఏపీలో కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 89 మంది చనిపోయారు. కేసులు కూడా.. మరోసారి పదివేలకు పైగా నమోదయ్యాయ. దీంతో ఏపీలో కరోనా బారిన...

మూడు నెలల్లో కొత్త జిల్లాల విభజన సిఫార్సులు..!

మూడు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల సందడి ప్రారంభమవనుంది. గత కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు..రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు...

జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ సన్ మళ్లీ అరెస్ట్..!

గురువారం సాయంత్రమే కడప జిల్లా జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. పాత కేసులేవీ అరెస్ట్ చేయడానికి లేకపోవడంతో... ...

HOT NEWS

[X] Close
[X] Close