బాల‌య్య సినిమా.. రైతు క‌థేనా??

రైతు క‌థల్ని ఇప్ప‌ట్లో వ‌దిలేట‌ట్టు లేరు మ‌న‌వాళ్లు. ఖైది నెంబ‌ర్ 150 రైతు స‌మ‌స్య ఆధారంగా తెర‌కెక్కింది. మ‌హ‌ర్షి అచ్చంగా రైతుల సినిమా. బాలకృష్ణ రూల‌ర్‌లోనూ రైతుల గురించి మాట్లాడారు. మొన్న వ‌చ్చిన భీష్మ‌లోనూ వ్య‌వ‌సాయం పాయింట్ అంత‌ర్లీనంగా ట‌చ్ చేశారు. శ‌ర్వానంద్ సినిమా శ్రీ‌కారం కూడా ఇలాంటి క‌థే. ఇప్పుడు బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను సినిమా కూడా రైతు స‌మ‌స్య మీద‌నే అని స‌మాచారం.

సింహా, లెజెండ్ తర‌వాత బాల‌య్య – బోయ‌పాటి కాంబో మ‌ళ్లీ రిపీట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అంజ‌లి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో ఇద్ద‌రు బాల‌య్య‌లు క‌నిపిస్తారు. తొలి స‌గం అనంత‌పురం నేప‌థ్యంలో సాగుతుంది. అక్క‌డ రైతుల స‌మ‌స్య‌ల‌పై క‌థానాయ‌కుడు పోరాటం చేస్తుంటాడు. అత‌నికి ఆ జిల్లా క‌లెక్ట‌ర్ (అంజ‌లి) స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుంటుంది. సెకండాఫ్‌లో క‌థ కాశీ షిఫ్ట్ అవుతుంది. ఆ త‌ర‌వాత సినిమా క‌ల‌ర్ మొత్తం మారిపోతుంది. టేకాఫ్ కోసం రైతు పాయింట్‌ని తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. అయితే ఇప్పటికే రైతుల స‌మ‌స్య‌లు, వాళ్ల క‌ష్టాలు, క‌న్నీళ్లు, క‌థానాయ‌కుల పోరాటాలూ చూసీ చూసీ అల‌సిపోయారు ప్రేక్ష‌కులు. మ‌రి ఇందులోనే బోయ‌పాటి ఎలాంటి వైవిధ్యం చూపించ‌ద‌ల‌చుకున్నాడో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close