అక్కడ ఇళ్ల స్థలాలిచ్చి పేదల్ని కోర్టుల చుట్టూ తిప్పుతారా..?

రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించి… కొన్ని వేల మంది పేదలు న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లోని 1251 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలుగా పంచేందుకు.. ప్రభుత్వం జీవో జారీ చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ఎలాంటి వివాదాలు లేని భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఒకపక్క భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే.. ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం.. ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే అవుతుందని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు.

రాజధాని భూముల్ని లబ్ధిదారులకు ఇచ్చి.. చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోందని .. చట్టపరమైన చిక్కులతో పేదలు ఇబ్బందులు పడతారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్‌, శ్మశాన భూములు, పాఠశాల మైదానాలను.. ఇళ్ల స్థలాలుగా మార్చాలనుకోవడం సరికాదని.. ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. ఇలాంటి వాటితో తేలిపోతోందంటున్నారు. జనసేన అధినేత చెప్పిన అభిప్రాయమే.. ఇతర రాజకీయవర్గాల్లోనూ ఉంది. రాజధాని రైతులకు.. ఇళ్ల స్థలాల కేటాయింపు పేరుతో.. ఇతరుల్ని ఆ ప్రాంతానికి పంపించి ఘర్షణ పూరిత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అదే సమయంలో.. ఏపీ సర్కార్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎంపిక చేసిన ప్రదేశాలు వివాదాస్పదమవుతున్నాయి. స్మశానాలు.. స్కూళ్లు, పార్కుల్ని.. చదును చేసి.. ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నట్లుగా తేలడంతో.. ప్రభుత్వం తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. వీటిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close