బాల‌కృష్ణ‌కు ద‌ర్శ‌కుడు దొరికేశాడు

మోక్ష‌జ్ఞ రీ ఎంట్రీ గురించి నంద‌మూరి అభిమానులు సుదీర్ఘ‌కాలంగా నిరీక్షిస్తూనే ఉన్నారు. బాల‌య్య కూడా `వ‌స్తాడు.. వ‌స్తాడు` అంటూ ఊరిస్తూనే ఉన్నాడు. కానీ అదెప్పుడో తేల‌డం లేదు. బోయ‌పాటి శ్రీ‌ను, క్రిష్‌, సింగీతం శ్రీ‌నివాస‌రావు – ఇలా చాలా మంది పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. వాళ్ల‌తో ఒక‌రు మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని చెప్పుకున్నారు. కానీ ఆ ఆలోచ‌న‌ల‌న్నీ అట‌కెక్కేశాయి. మోక్ష‌జ్ఞ ఎంట్రీ 2020లో లేన‌ట్టే. 2021లో వ‌స్తాడ‌నుకుంటే… ఓ ద‌ర్శ‌కుడు మోక్షుతో సినిమా చేయ‌డానికి రెడీగా ఉన్నాడు. త‌నే… అనిల్ రావిపూడి.

వ‌రుస విజ‌యాల‌తో సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు త‌న దృష్టంతా పెద్ద హీరోల‌పైనే ఉంది. అయితే ఓ ద‌శ‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే ఛాన్స్ వ‌చ్చింది `రామారావుగారు` అనే క‌థ‌ని సిద్ధం చేసిన‌ట్టు వార్త‌లొచ్చాయి. అయితే అది కార్య‌రూపం దాల్చ‌లేదు. కాక‌పోతే ఇప్ప‌టికీ బాల‌య్య‌తో ప‌నిచేయ‌డానికి రెడీగానే ఉన్నాడు అనిల్ రావిపూడి. కుదిరితే బాల‌య్య‌తో ప‌నిచేస్తాన‌ని, మోక్ష‌జ్ఞ‌తోనూ సినిమా చేయాల‌ని ఆశ ప‌డుతున్నాన‌ని మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు అనిల్ రావిపూడి. బాల‌య్య సంగ‌తేమో గానీ… మోక్ష‌జ్ఞ‌ని అనిల్ రావిపూడి చేతిలో పెడితే… సేఫ్ జోన్‌లో ఉన్న‌ట్టే. ఎందుకంటే… అస‌లు ఫ్లాప్ అనే మాట ఇప్ప‌టి వ‌ర‌కూ ఎర‌గ‌లేదు అనిల్‌. క‌నీసం మినిమం గ్యారెంటీ సినిమా తీసిపెట్ట‌గ‌ల‌డు. పైగా అనిల్ – మోక్ష‌జ్ఞ కాంబో అంటే క్రేజ్ మ‌రింత బాగుంటుంది. సో… మోక్ష‌జ్ఞ కోసం బాల‌య్య‌కు ద‌ర్శ‌కుల్ని వెదికే ప‌ని త‌ప్పింది. కాక‌పోతే మోక్ష‌జ్ఞ‌నే కాస్త రెడీ చేయాలి. బాల‌య్యా… ఆ ప‌నిలో ఉండండి మ‌రి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాత్రికి రాత్రి పంటల బీమా సొమ్ము చెల్లింపు..!

పంటల బీమా విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది. రైతుల తరపున.. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని హడావుడిగా నిన్న...

కర్ణాటకలోనూ పచాయతీ ఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు...

పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత...

హైదరాబాదీ.. కమాన్ లెట్స్ ఓట్..!

చదువుకున్న వాళ్లు ఓటు వేయరా..!? భారత దేశంలో ఎప్పుడు.. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. మెట్రో సిటీలు లేని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఎనభై శాతం వరకూ ఉంటుంది. వ్యవసాయదారులు.. చిన్న వ్యాపారులు.. చిరు...

HOT NEWS

[X] Close
[X] Close