వెబ్ సిరీస్ ప‌నుల్లో మారుతి బిజీ

ఆహా.. ఈమ‌ధ్యే తెర‌పైకి వ‌చ్చిన ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌. అల్లు అర‌వింద్ దీనికి పెద్ద దిక్కు. ఆహా కోసం ప‌దుల సంఖ్య‌లో వెబ్ సిరీస్‌లు త‌యార‌వుతున్నాయి. ఇప్ప‌టికే క్రిష్ ఓ వెబ్ సిరీస్‌ని ఆహా కోసం అందించారు. మ‌రో వెబ్ సిరీస్ ప‌నుల్లో ఉన్నారు. ఇప్పుడు మారుతి కూడా వెబ్ సిరీస్‌ల కోసం క‌లం క‌దిలిస్తున్నారు. మారుతికీ గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌కీ ఉన్న అనుబంధం చెప్పాల్సిన ప‌ని లేదు. ఆయ‌న ఆ కాంపౌండ్ వ్య‌క్తే. అందుకే ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం కొన్నివెబ్ సిరీస్‌లు సిద్ధం చేయ‌మ‌ని అల్లు అర‌వింద్ మారుతికి పుర‌మాయించారు. వెబ్ సిరీస్‌ల‌కు సంబంధించిన కంటెంట్ వెదికే ప‌నిలో ఉన్నారు మారుతి. త‌న శిష్యుల‌కు సైతం కొన్ని వెబ్ సిరీస్‌లు అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం కొంత‌మంది యువ ర‌చ‌యిత‌లు, యువ ద‌ర్శ‌కుల‌తో మారుతి మంత‌నాలు జ‌రుపుతున్నారు. క‌నీసం ఐదారు వెబ్ సిరీస్‌లు మారుతి నుంచి రాబోతున్నాయి. వీటికి క‌థ‌, స్క్రీన్ ప్లే లాంటివి మారుతి అందించినా, లేక‌పోయినా.. వాటి వెనుక మారుతి హ‌స్తం ఉండ‌డం సుస్ప‌ష్టం. మారుతి అనే కాదు.. గీతా ఆర్ట్స్‌తో అనుబంధం ఉన్న కొంత‌మంది ద‌ర్శ‌కులు ప్ర‌స్తుతం ఆహా కోసం వెబ్ సిరీస్‌లు అందించే ప‌నిలో బిజీగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close