ఏపీ లిక్కర్ పాలసీతో పొరుగు రాష్ట్రాలకు పండగ..!

ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు ఉన్న తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మద్యం ఆదాయం గణనీయంగా పెరిగింది. అది కూడా… మిగిలిన చోట్ల… సాధారణంగానే ఉన్నా.. ఏపీ పొరుగు జిల్లాల్లో మాత్రం… 30 శాతం వరకూ పెరుగుదల నమోదవుతోంది. అదంతా.. అక్కడ్నుంచి ఏపీలోకి వస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు… షాక్ కొట్టేలా చేశారు జగన్. అలాగే.. ప్రముఖ బ్రాండ్లూ లేవు. నీదే బ్రాండ్..నీదే బ్రాండ్ అని పలకరించుకునే మందుబాబులకూ.. ఆ బ్రాండ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. వీరి అవసరాల్ని స్మగ్లర్లు తీరుస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. పొరుగురాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నారు.

ఏపీలో జూన్ లో 12లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణలో ఈ సంఖ్య 28లక్షలు. జూన్‌తో పోలిస్తే నాలుగు లక్షల కేసులు ఎక్కువ. పెరుగుదల అంతా సరిహద్దు జిల్లాల్లోనే. కర్నాటకలో మే నెలలో 44లక్షల మద్యం కేసుల అమ్మకాలుంటే.. జూన్‌లో అది 56లక్షలకు చేరింది. ఒక్క నెలలో పెరిగిన 12లక్షల కేసుల అధిక అమ్మకాల్లో సగం రాయలసీమ జిల్లాలకు వచ్చి ఉంటాయని ఎవరైనా అంగీకరించే నిజం. అయితే ఏపీలో రేట్లు బాదేసినా ఆదాయం పడిపోతుంది. మరో వైపు చీప్ లిక్కర్ తాగావాళ్లు… శానిటైజర్లకు బానిసలవుతున్నారు. ఇలా శానిటైజర్లు తాగిన వారిలో ఇరవై మంది వరకూ చనిపోయారు.

మద్యం దుకాణాలు తగ్గించడం… రేట్లు పెంచడం వంటి చర్యల వల్ల.. మద్యానికి బానిసైన వాళ్లు మానేస్తారనుకోవడం పొరపాటని నిపుణులు ముందు నుంచీ చెబుతున్నారు. ప్రభుత్వ తీరు వల్ల నాటు సారానే కాదు.. అక్రమ మద్యం రవాణా కూడా విపరీతంగా పెరిగింది. ప్రత్యేకంగా ఎస్‌ఈబీ అనే శాఖను ఏర్పాటు చేసి దాడులు చేస్తున్నప్పటికీ.. ఏ మాత్రం… తగ్గడం లేదు. ఓ వైపు ఆదాయం.. కోల్పోయి.. మరో వైపు పొరుగు రాష్ట్రాలకు వరంగా మారిన నేపధ్యంలో ప్రభుత్వం ధరల తగ్గింపు ఆలోచన చేస్తోందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమిత్‌ షాతో భేటీ కోసం ఢిల్లీకి జగన్..!

ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన పర్యటన హఠాత్తుగా ఖరారయింది. చాలా రోజుల నుంచి ఆయన కేంద్రమంత్రుల్ని కలవాలని అనుకుంటున్నారు. గతంలో రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెళ్లిన తర్వాత...

పంపుసెట్లకు మీటర్లను జగన్ ఎందుకు పెడుతున్నారో చెప్పిన హరీష్ రావు..!

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడుతున్న వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఒక వేళ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభమైతే..రైతులు...

ప్రాయశ్చిత్త హోమాలు చేయాలని ఏపీ సర్కార్‌కు ఆస్థాన స్వామిజీ సలహా..!

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు..హిందూత్వంపై వైసీపీ నేతల అరాచక వ్యాఖ్యలకు పరిహారంగా.. ప్రాయశ్చిత్త హోమాలు చేపట్టాలని వైఎస్ జగన్ .. వైసీపీ నేతల ఆస్థాన స్వామిజీ స్వరూపానంద సరస్వతి సూచించారు. వరుస...

రైతులకు ఆ బిల్లులు ఉపయోగపడితే సంబరాలు ఎందుకు చేసుకోరు ?: కేటీఆర్

బిల్లులు ఎలా ఆమోదించుకోవాలో.. ఎలా ప్రజామోదం సంపాదించాలో.. తెలంగాణను చూసి నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. కేంద్రం వివాదాస్పదంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేటీఆర్ స్పందన.. అంతే...

HOT NEWS

[X] Close
[X] Close