స‌ర్కారు వారి ‘గంట’ కొట్టిన మ‌హేష్‌

ఈరోజు మ‌హేష్‌బాబు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా `స‌ర్కారువారి పాట‌` నుంచి ఏదో ఓ స‌ర్‌ప్రైజ్ వ‌స్తుంద‌ని మ‌హేష్ అభిమానులు ఆశించారు. చిత్ర‌బృందం కూడా.. త‌ప్ప‌కుండా బ‌ర్త్‌డే గిఫ్ట్ ఉంటుంద‌ని ఊరిస్తూ వ‌చ్చింది. ఈరోజు స‌రిగ్గా 9 గంట‌ల 9 నిమిషాల‌కు `స‌ర్కారు..` మోష‌న్ పోస్ట‌ర్ వ‌చ్చింది. ఈసారి మ‌హేష్ క‌నిపించ‌లేదు గానీ, వెనుక నుంచి త‌మ‌న్ త‌న ఆర్‌.ఆర్‌తో అద‌ర‌గొట్టాడు. స‌ర్కారువారి పాట లోగోని డిజైన్ చేసిన విధానం.. బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే బీజియ‌మ్‌, గంట‌, ఓం గుర్తు.. ఇలా టోట‌ల్ మాసీగా ఉన్నాయి. ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. లేదంటే.. ఈపాటికి టీజ‌రో, డైలాగో బ‌య‌ట‌కు వ‌చ్చేసేది.

చిరు ట్వీట్

మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. మ‌హేష్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. “అందం, అభిన‌యం భ‌గ‌వంతుడు మీకిచ్చిన వ‌రం. మ‌రెన్నో మ‌ర్చిపోలేని పాత్ర‌లు చేయాల‌ని, మీ క‌ల‌ల‌న్నీ నెర‌వేరాల‌ని కోరుకుంటున్నా“ అంటూ ట్వీట్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.