నాని సినిమాని సీక్వెల్ వ‌స్తోంది

వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ స్థాపించి ‘అ’ సినిమాతో బోణీ కొట్టాడు నాని. నిర్మాత‌గా త‌న అభిరుచి ఎలాంటిదో తొలి సినిమాతోనే చూపించాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. ‘అ’ క‌మర్షియ‌ల్ గా సేఫ్ ప్రాజెక్టు. ఓ కొత్త సినిమా చూశామ‌న్న అనుభూతి ప్రేక్ష‌కుల‌కు క‌లిగింది. విమ‌ర్శ‌కులూ మెచ్చుకున్నారు. అవార్డులూ ద‌క్కాయి. ఇప్పుడు `అ` సినిమాకి సీక్వెల్ రాబోతోంది. ‘ఆ 2’ కి సంబంధింని స్క్కిప్టుని ప్ర‌శాంత్ వ‌ర్మ ఎప్పుడో సిద్ధం చేశాడు. ప్ర‌స్తుతం ‘జాంబీ రెడ్డి’ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఈ సినిమా పూర్త‌య్యాకే `అ 2` ప‌ట్టాలెక్కుతుంది. “అ ని హిందీలో రీమేక్ చేయ‌మ‌ని అడిగారు. ఆ 2 కూడా హిందీలోనే తీయాల‌నుకున్నాం.కానీ. ముందు తెలుగులో నిరూపించుకున్న త‌ర‌వాత‌.. బాలీవుడ్ రీమేక్ గురించి ఆలోచిస్తా“ అంటున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌న ద‌గ్గ‌ర 32 క‌థ‌లు సిద్ధంగా ఉన్నాయ‌ట‌. అందులో అగ్ర హీరోల‌కు స‌రిప‌డా స్క్కిప్టులు కూడా ఉన్నాయ‌ని చెబుతున్నాడు. `జాంబీ రెడ్డి` హిట్ట‌యితే… త‌ప్ప‌కుండా పెద్ద హీరోల నుంచి ఛాన్సులు రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close