వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు.. విజయవాడలో ఓ జేబుదొంగల కుటుంబానికి కార్పొరేటర్ టిక్కెట్ ఇచ్చారు. గెలిచిన తర్వాత కూడా ఆ కుటుంబం తమ వృత్తిని మానుకోలేదు. ఓ టీడీపీ సభలో జేబులు కొడుతూ దొరికిపోయారు. కేసులు అయ్యాయి. అప్పుడు వాళ్ల బ్యాక్ గ్రౌండ్ చూసి.. వైసీపీ స్ట్రాటజీ అదేనని అందరూ బిత్తరపోయారు. చిన్న చిన్న నేరస్తుల నుంచి పై స్థాయి వరకూ నేర మనస్థత్వం ఉన్న వారిని రాజకీయంగా ప్రోత్సహించడం ఆ పార్టీ స్ట్రాటజీలో ముఖ్యం. నెల్లూరు లేడీ డాన్ గా ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన అరుణకూ అలాగే ప్రోత్సాహం లభించింది. ఆమె చెలరేగిపోయారు.
వైసీపీ నేతగా ఎదిగిన అరుణ
నెల్లూరు అరుణ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దిశ యాప్ ప్రచారకురాలి అవతారం ఎత్తింది. ఆమె చేస్తున్న దందాలతో వైసీపీ నేతలు ఫిదా అయ్యారు. వారి సహకారంతో పోలీసు ఉన్నతాధికారులతో చనువు పెంచుకున్నారు. పోలీసులకే ఎలాంటి పనిని అయినా చేసిపెట్టే స్థాయికి వెళ్లారు. ఆమె ఎంత రేంజ్ కు వెదికారంటే.. ఓ ఖైదీని ఆస్పత్రికి పిలిపించుకుని పోలీసుల్ని కాపలా పెట్టుకుని ఆ ఖైదీతో సంసారం చేసేంత స్థాయికి ఎదిగారు. ఆ వీడియోలు వెలుగులోకి రావడంతో ఇప్పుడు రాష్ట్రం అంతా ఆశ్చర్యపోతోంది.
వైసీపీ మాజీ మంత్రి కుమారుడి పని
ఇద్దరు ఐపీఎస్లు వద్దని చెప్పినా నేరుగా హోంశాఖ కార్యాలయం నుంచి పెరోల్ జీవోను రిలీజ్ చేయించుకోవడం వెనుక పెద్ద తలకాయ ఎవరో ఉండి ఉంటారని సులువుగా ఊహిస్తారు. ఓ వైసీపీ మాజీ మంత్రి కుమారుడు ఈ పని చేసి పెట్టినట్లుగా సచివాలయ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఈ విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు కూడా చేతులు మారినట్లుగా తెలుస్తోంది. తాను పదకొండు లక్షలు ఇచ్చినట్లుగా అరుణ ఈ అంశంలో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అరుణ ఒకప్పుడు చిన్న బొతిక్ నడుపుకునేవారు. ఆమే నేర మనస్థత్వంతో.. రౌడీలతో పరిచయాలు పెంచుకుని సెటిల్మెంట్లు చేస్తున్నారు. దానికి మనుషుల్ని అసువుగా చంపే…శ్రీకాంత్ అనే రౌడీతో పరిచయాలు పెంచుకుని ఆ పని చేస్తోంది.
మొత్తం తీగ లాగుతున్న అధికారులు
అసలు వైసీపీ హయాంలో ఈ అరుణ ఏం చేసింది.. ఇప్పుడు మళ్లీ ఏం చేస్తోంది అనేది అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. పాత దందాలు, సెటిల్మెంట్లు, సహకరించిన అధికారులు.. ఇలా జాబితా మొత్తం రెడీ చేస్తున్నారు. బాగోతం అంతా బయట పెట్టి కఠిన చర్యలు తీసుకోనున్నారు.