ప్రపంచ ఎంటర్టైన్మెంట్ చరిత్రలో అతిపెద్ద డీల్ జరిగింది. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ప్రసిద్ధ వార్నర్ బ్రదర్స్ కంపెనీని సొంతం సుకునే ఒప్పందాన్ని పూర్తి చేసింది. 83 బిలియన్ డాలర్లకు ఫిల్మ్ & టెలివిజన్ స్టూడియో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసింది. ఇది దశాబ్దంలోనే వినోద రంగంలో జరిగిన అతిపెద్ద డీల్.
నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్, ఫిల్మ్ స్టూడియోలు, టెలివిజన్ స్టూడియోలు, HBO Max , HBOతో కలిపి పూర్తిగా కొనుగోలు చేసినట్లు సంయక్త ప్రకటన విడుదల చేశారు. ఈ డీల్ ద్వారా ఇప్పటి వరకు OTT లో ఆధిపత్యం చలాయించిన నెట్‌ఫ్లిక్స్, ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ బ్యానర్‌తో థియేట్రికల్ ఫిల్మ్ ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెడుతోంది.
నెట్‌ఫ్లిక్స్ ప్రయాణం నిజంగా ఒక సినిమా కథ లాంటిదే. 1997లో మామూలు DVD రెంటల్ సర్వీస్‌గా ప్రారంభమైన ఈ సంస్థ, కాలానుగుణంగా మార్చుకుంటూ ప్రపంచ వినోద రంగంలో ఒకొక్కమెట్టు ఎదిగింది. DVDల నుంచి ఆన్లైన్ స్ట్రీమింగ్ వైపు అడుగుపెట్టిన వెంటనే, వీక్షకుల కంటెంట్ చూసే విధానాన్ని పూర్తిగా మార్చింది. తరువాత ఒరిజినల్ కంటెంట్ నిర్మాణం ప్రారంభించి ప్రపంచ హిట్ సిరీస్‌లతో అలరించింది. అన్ని దేశాల్లోనూ చందాదారులని సంపాదించుకుంది. ఇప్పుడు జరిగిన డీల్ వరల్డ్ థియేటర్ సినిమా, బిజినెస్ లో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం వుంది.