న‌లుగురు ద‌ర్శ‌కుల ‘పిట్ట‌క‌థ‌లు’

ఆంథాల‌జీల‌కు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్‌, అమేజాన్ లాంటి ఓటీటీ సంస్థ‌లు అంథాల‌జీల వైపు దృష్టి పెడుతున్నాయి. తాజాగా తెలుగులో మ‌రో ఆంథాల‌జీ వ‌స్తోంది. అదే.. `పిట్ట‌క‌థ‌లు`. నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ఈ పిట్ట క‌థ‌ల‌కు.. నాగ అశ్విన్‌, త‌రుణ్ భాస్క‌ర్‌, నందినిరెడ్డి, సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఒకొక్క‌రూ.. ఒక్కో క‌థ‌ని తెర‌కెక్కించారు. ఈ నాలుగు క‌థ‌ల స‌మాహార‌మే.. `పిట్ట క‌థ‌లు`. ఫిబ్ర‌వ‌రి 19న ఈ పిట్ట‌క‌థ‌ల్ని నెట్ ఫ్లిక్స్‌లో చూడొచ్చు.

త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన క‌థ `రాముల‌`. ఇందులో మంచు ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌ధారి. నందినిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌థ `మీరా.` ఇందులో జ‌గ‌ప‌తిబాబు, అమ‌లాపాల్ న‌టించారు. నాగ అశ్విన్ `ఎక్స్ లైఫ్‌` అనే క‌థ‌ని తెర‌కెక్కించారు. ఇందులో శ్రుతిహాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారి. `పింకీ` అనే క‌థ‌కు సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఇందులో స‌త్య‌దేవ్‌, ఈషా రెబ్బా జంట‌గా న‌టించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో తిరుగుబాటు వార్తలు..! సజ్జల వివరణ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అంటూ రిపబ్లిక్ టీవీలో వచ్చిన ఓ కథనం ఇప్పుడు వైసీపీలో అలజడి రేపుతోంది. ఎంతగా అంటే.. ఆ పార్టీకి జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తిగా బరువు,...

స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగదని కేంద్రంతో చెప్పించిన వైసీపీ ఎంపీలు..!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తమ వద్ద ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని చెబుతున్న వైసీపీ నేతలు... ఢిల్లీ నుంచి మాత్రం ఏపీకి స్టీల్ ప్లాంట్‌తో సంబంధం లేదనే ప్రకటనలు...

తెలంగాణ మహిళల గురించి సరే….షర్మిల తన హక్కుల కోసం ఎలా పోరాడుతారు..!?

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి.. రాజన్న రాజ్యం తీసుకు వచ్చి.. అందరికీ న్యాయం చేసేయాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఉపయోగించుకున్నారు. పెద్ద...

చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నారంటున్న సజ్జల..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాలు కానీ.. రాజకీయ విమర్శలు కానీ బూతుల రేంజ్‌లో ఎవరు చేస్తారు..? అంటే ప్రత్యేకంగా సమాధానం వెదుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే అదే వైసీపీ నేతలు ఇప్పుడు.. చంద్రబాబు, లోకేష్...

HOT NEWS

[X] Close
[X] Close