తెరపైకి పులివెందుల కాల్‌మనీ కేసు..!

టీడీపీ హయాంలో… విజయవాడలో కాల్‌మనీ కేసు కలకలం రేపింది. దీని ఆధారంగా.. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి.. అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా.. చేసిన ఎస్పీల సమీక్షలోనూ.. ఇదే కేసుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా.. కాల్‌మనీ కేసు బయటపడింది. ఈ సారి కాల్‌మనీ వ్యాపారులు.. పులివెందుల వాసులే. బాధితుడు… మాత్రం.. సామాన్యుడు కాదు. మాజీ ఎమ్మెల్యే. అదీ కూడా.. గతంలో వైఎస్ ప్రాపకంతో ఎమ్మెల్యే అయిన నేత.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2004-2009 వరకు అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యేకా ఉన్న జొన్నా రామయ్య.. నిన్న తన ప్రాణానికి పులివెందుల వడ్డీ వ్యాపారుల నుంచి ప్రాణహానీ ఉందని.. ఫిర్యాదు చేశారు. చాలా కొద్ది మొత్తం అప్పు ఇచ్చి.. ఇప్పటికీ పులివెందుల వడ్డీ వ్యాపారులు తన వద్ద నుంచి రూ. పది కోట్లు వసూలు చేశారని.. ఇంకా అప్పు అలాగే ఉందని.. వేధిస్తున్నారని… కన్నీటి పర్యంతమయ్యారు. వారి బారినుంచి తనను కాపాడాలని ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డిని, పోలీసులను, మీడియాను వేడుకున్నారు. తన ఆస్తులన్నీ లాగేసుకున్నారని.. తనకు ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదని.. అయినప్పటికీ వేధిస్తున్నారని.. ఆవేదన చెందుతున్నారు.

నిజానికి కదిరిలో చాలా కాలంగా పులివెందుల ప్రాబల్యమే ఉంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున వడ్డీ వ్యాపారులు కదిరిలో వడ్డీలకు ఇస్తూంటారు. అయితే అవన్నీ.. కాల్ మనీ తరహా వ్యాపారాలే. అధిక వడ్డీలు వసూలు చేస్తారు. ఇవ్వకపోతే.. ఏం చేయడానికైనా వెనుకాడరు. రాజకీయంగానూ.. వారు కదిరిలో పట్టు సాధించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కూడా పులివెందుల ప్రాంతానికి చెందినవారనే ప్రచారం ఉంది. కొద్ది రోజుల క్రితం.. ఈ పులివెందుల కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలకు భరించలేక… ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విజయవాడ కాల్‌మనీ కేసులపై అంతగా స్పందించిన జగన్మోహన్ రెడ్డి.. ఓ మాజీ ఎమ్మెల్యే వ్యక్తం చేస్తున్న ఆవేదనను పట్టించుకుంటారో లేదో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close