కర్ణాటకలో బలపరీక్ష జరిగితే “కుమార” విజయమేనా..?

కర్నాటకలో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. రెండు వారాలుగా సాగుతున్న పొలిటికల్‌ డ్రామా కొత్త మలుపు తీసుకుంటోంది. అయితే అంతా క్లైమాక్స్‌ చేరుకుందనుకున్న సమయంలో కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు సీఎం కుమారస్వామి. ఓ వైపు ఎమ్మెల్యేలు రాజీనామాల పేరుతో తప్పుకుంటున్నా.. కుమారస్వామి మాత్రం బలపరీక్షకు సై అన్నారు. డేట్‌ టైమ్‌ చెబితే తన బలమెంటో నిరూపించుకుంటానని చెబుతున్నారు. రాజీనామాలు, కోర్టులు, పొలిటికల్‌ ఎత్తుల చూట్టు తిరుగుతున్న కర్నాటకంలో.. సీఎం నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.

రాజీనామాలు ఆమోదించాలంటూ రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. కాసేపటికే కుమారస్వామి విశ్వాస పరీక్షకు సై అన్నారు. ఎలాంటి సంక్షోభమైనా సరే… శాసనసభ సాక్షిగా ఎదుర్కొంటానంటూ సవాల్‌ విసిరారు. కుమారస్వామి నిర్ణయం… రాజకీయ వర్గాల్లో సంచలనమవుతోంది. అటు బీజేపీ కూడా డిఫెన్స్‌లో పడింది. నిజానికి విశ్వాస పరీక్షలోపు రాజీనామాలు ఆమోదం పొందకుంటే… అనర్హత వేటు ఖాయంగా కనిపిస్తోంది. కుమారస్వామి విశ్వాసపరీక్షకు సిద్ధమని చెప్పగానే… బీజేపీ నేతలు అలర్టయ్యారు. నెంబర్‌ గేమ్‌ మొదలు కావడంతో ప్రతి ఎమ్మెల్యేను కాపాడుకునే పనిలో పడ్డారు.

సంకీర్ణ కూటమి సమన్వయకర్తగా ఉన్న సిద్ధరామయ్య బీజేపీపై మైండ్ గేమ్ ప్రారంభించారు. విశ్వాస పరీక్షకు బీజేపీ నేతలు భయపడుతున్నారని.. ఎందుకంటే వారిలో కొందరు గొర్రెలు ఉన్నారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఒకేవేళ తాజా సంక్షోభంతో అధికార మార్పిడి జరగకపోతే… బీజేపీ పరువు పోతుంది. ఒక వేళ సాధ్యం కాకపోతే.. అసలు జేడీఎస్‌నే.. తమ వైపు లాక్కోవాలని.. బీజేపీ ప్రయత్నిస్తోంది. కుమారస్వామి సోదరుడు రేవణ్ణతో బీజేపీ కర్నాటక ఇంఛార్జ్‌ మురళీధరరావు భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేవణ్ణకు డిప్యూటీ సీఎం పోస్ట్‌ ఇచ్చి… ఆయన అనుచర ఎమ్మెల్యేలను కలుపుకునిపోతారన్నప్రచారం సాగుతోంది. అయితే కుమారస్వామి మాత్రం బీజేపీతో కలిసే ప్రసక్తే లేదంటున్నారు. మొత్తంగా ఈ తరహా ప్రచారం కూడా ఆసక్తి రేపుతోంది.

కర్నాటక అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 224. అయితే కాంగ్రెస్‌కి 78 మంది సభ్యులు, జేడీఎస్‌కి 37, బీఎస్పీ ఒక సభ్యుడు ఉన్నారు. బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇద్దరు స్వతంత్రులు బీజేపీకి మద్దతు పలుకుతుండటంతో ఆ సంఖ్య 107కి చేరింది. సంకీర్ణ సర్కార్‌ మద్దతు 116గా ఉండగా… 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలు ఆమోదిస్తే కూటమి బలం 100కి పడిపోతుంది. ఇప్పుడు ఎలా చూసినా బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close