రాజధాని తరలింపుపై కొత్త కదలికలు నిజమేనా..!?

రాజధాని తరలింపు బిల్లులను మళ్లీ అసెంబ్లీలో పెట్టడంపై.. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతకు ముందు ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ ఆలస్యం అవుతూండటంతో.. సుప్రీంను ఆశ్రయించారు. అలాగే అంతకు ముందే.. మొదటి సారి పెట్టిన బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపినా… మండలి కార్యదర్శి తొక్కి పెట్టారని.. మండలి చైర్మన్ ఆదేశాలను అమలు చేయడం లేదంటూ.. మరో పిటిషన్ కూడా వేశారు. దానిపై హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. అయితే.. ఈ లోపు.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలింపునకు రంగం సిద్ధం అయిందంటూ.. కొత్త ప్రచారం ప్రారంభమవడం… రాజకీయవర్గాల్లో కొత్త సందేహాలకు కారణం అయ్యాయి.

నిజంగానే ప్రభుత్వం వైపు నుంచి.. ఆ పనులు ప్రారంభమయ్యాయని అంటున్నారు. చట్ట పరిధిలో ఉందని.. ఆ పనులన్నీ పూర్తయిన తర్వాతే తరలిస్తామని.. ప్రభుత్వం .. హైకోర్టుకు చెప్పింది. ఇప్పుడు.. ఆ చట్టపరమైన పనులు పూర్తయ్యాయని అనిపించుకోవడానికి అన్ని రకాల పనులు పూర్తి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు రెండవ సారి శాసన మండలిలో పెట్టారు. దాన్ని తిరస్కరించలేదు.. ఆమోదించలేదు. అంటే.. రాజ్యంగం ప్రకారం నెలరోజుల తర్వాత ఆమోదం పొందినట్లే అవుతుందనే వాదనను ప్రభుత్వం తెరపైకి తీసుకు వచ్చింది. మండలి లో రెండవ సారి ప్రవేశపెడితే ఆ బిల్లు మండలి తిరస్కరించిన, సవరణలు ప్రతిపాదించిన 30రోజుల్లో బిల్లు పాస్ అయినట్టే భావించాలని రాజ్యాంగంలో ఉంది. ఈ నిబంధననను ఉపయోగించుకుని.. బిల్లు పాసయిందని.. గవర్నర్‌తో సంతకం పెట్టించుకునే ఆలోచన చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఇక్కడే అసలు సమస్య ఉంది. మొదటగా పెట్టిన బిల్లు శాసనమండలిలోనే ఉంది. దాన్ని తిరస్కరించడమో.. ఆమోదించడమో చేస్తే…రెండో సారి పెట్టొచ్చు. కానీ ఇప్పుడు… ఒకే అంశంపై రెండు బిల్లులు మండలిలో ఉన్నట్లుగా అవుతాయి. ఒకటి సెలక్ట్ కమిటీకి వెళ్లాల్సి ఉంది. పైగా న్యాయస్థానంలో ఉంది. ఇన్ని క్లిష్టమైన విషయాల మధ్య కూడా.. ప్రభుత్వం… ఆ బిల్లుల ఆమోదం పొందాయనే అంశానికే కట్టుబడి… ముందుకెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే… మళ్లీ రాజధాని తరలింపు వార్తలు తెరపైకి వస్తున్నాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ పోలీసుల పనితీరు రాష్ట్రపతి భవన్‌ వరకూ వెళ్లింది..!

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు బ్యాడ్ టైం కొనసాగుతోంది. వరుసగా సీబీఐ విచారణలకు తోడు... రాజకీయ కారణాలతో ప్రాథమిక హక్కులను హరిస్తున్నారన్న ఫిర్యాదులు రాష్ట్రభవన్ వరకూ వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ప్రసాద్...

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...

HOT NEWS

[X] Close
[X] Close