మళ్లొస్తున్న కొత్త రకం కరోనా.. భారత్‌లో హైఅలర్ట్ !

కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. కరోనా కొత్త వేరియంట్‌పై భారత్ లో హైఅలర్ట్ ప్రకటించారు. కొత్త వైరస్‌ను దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ B.1.1.529గా గుర్తించారు. ఈ వైరస్ ప్రభావంపై స్పష్టత రావడంతో రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పూర్తి మూడెంచెల స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్‌, బోట్స్‌వానాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

“విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల శాంపిల్స్‌ని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించాలి. కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టిసారించాలి. వీసా పరిమితులు తగ్గించడం, అంతర్జాతీయ ప్రయాణంపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఈ వేరియంట్‌ వ్యాప్తికి అవకాశం ఉంటుంది. అందువల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.” అని కేంద్రం స్పష్టం చేసింది.

కొత్త వేరియంట్‌ ప్రజారోగ్యానికి సవాల్‌ విసిరే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో కొత్త వేరియంట్‌కు మ్యుటేషన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విస్తృతంగా వ్యాప్తి చెందడం, రోగనిరోధక శక్తిని ఏమార్చడం వంటివి ఈ రకం వైరస్‌లో ఎక్కువ ఉన్నట్లుగా భావిస్తున్నారు. అప్రమత్తం కాకపోతే .. మరోసారి మూడో వేవ్ ఈ రకంతోనే వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close