తెలంగాణా లో కొత్త జిల్లాల కుదింపు?

తెలంగాణా ప్రభుత్వం 2016 లో దసరా పండుగ రోజున 31 జిల్లాలతో కొత్త తెలంగాణా మ్యాప్ ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కొత్త జిల్లాలపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. త్వరలో కొన్ని జిల్లాలను ప్రక్క జిల్లాల్లో విలీనం చేయనున్నట్టు, తద్వారా జిల్లాల సంఖ్య ని తగ్గించనున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

రాష్ట్రంలో అదనంగా ఏర్పాటు చేసిన పలు కొత్త జిల్లాలను కొనసాగించాల్సిన అవసరం ఉందా అని ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. స్థానిక అవసరాలు, ప్రజల డిమాండ్లు, నేతల ఒత్తిళ్ల కారణంగా 31 జిల్లాలు ఏర్పాటు చేసినా, పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని తెలంగాణా ప్రభుత్వం నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. చివరి దశలో నేతల ఒత్తిళ్లతో తెరపైకి వచ్చిన కొత్త జిల్లాలు చిక్కులు తెచ్చిపెట్టాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది . ఈ క్రమంలో ఇప్పటికీ జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి జరుగుతున్న ఆందోళనలు, అక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని అధికారులను, పార్టీ ముఖ్య నేతలను ముఖ్యమంత్రి పురమాయించినట్లు తెలిసింది. పైగా ఒక్కసారిగా జిల్లాల సంఖ్య బాగా పెరగటంతో ఉద్యోగుల సర్దుబాటు, అధికారుల నియామకం తలనొప్పిగా మారింది.

కాబట్టి అలా అదనంగా ఏర్పాటు చేసిన జిల్లాలను చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో విలీనం చేయాలని యోచిస్తోంది. వరంగల్‌ రూరల్‌ ( అర్బన్ లో విలీనం ?) , జనగాం, నిర్మల్, పెద్దపల్లి, మేడ్చల్‌ జిల్లాలు రద్దయ్యే జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం. అయితే సమర్థవంతమైన పాలన అందించేందుకు అవసరమైన కొత్త జిల్లాలను మాత్రం యథాతథంగా కొనసాగించాలని భావిస్తోంది. త్వరలో ఈ విషయం పై పూర్తి క్లారిటీ ప్రభుత్వం నుంచి రావచ్చని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

HOT NEWS

[X] Close
[X] Close