సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి రాబోతున్న కొత్త తారల జాబితా ఆసక్తికరంగా ఉంది. సూపర్ స్టార్ లెగసీని మహేష్ బాబు విజయవంతంగా కొనసాగిస్తుండగా, ఇప్పుడు ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు కొత్త తరం సిద్ధమవుతోంది. ఒక్కరు కాదు..దాదాపు అర డజన్ మంది సూపర్ స్టార్ వారసులు టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నారు.
మంజుల కుమార్తె జాహ్నవి హీరోయిన్గా ఎంట్రీకి రెడీ అయ్యింది. ఇప్పటికే ఫోటోషూట్లు, యాక్టింగ్ ట్రైనింగ్‌లతో ఫుల్ ప్రిపరేషన్లో ఉంది. రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ తన తండ్రి, తాతల నటన వారసత్వాన్ని కొనసాగించేందుకు కసరత్తులు చేస్తున్నాడు. అలాగే ఆయన కుమార్తె భారతి కూడా హీరోయిన్గా స్క్రీన్ టెస్టులు, మోడలింగ్ షూట్లు పూర్తి చేసిందని టాక్.
సుధీర్ బాబు పెద్ద కుమారులు చరిత్, దర్శన్ యాక్షన్, డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.
మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని ఇప్పటికే 1: నేనొక్కడినే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు హీరోగా రీఎంట్రీ ఇవ్వడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ప్రముఖ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ ట్రైనింగ్ పొందుతున్నాడు.
మొత్తానికి, సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ లైనప్ బలంగా, ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. అయితే సూపర్ స్టార్ ట్యాగ్ మోయడం అంత తేలిక కాదు. సులువుగా ఎంట్రీ దొరుకుతుంది కానీ ప్రేక్షకులని మెప్పించడంలో అదనపు భారం వుంటుంది. మరా భారాన్ని మోసి సూపర్ స్టార్ వారసత్వాన్ని ఈ కొత్త తరం ఎలా కొనసాగిస్తుందో చూడాలి.