టెండర్లన్నీ ఇక పులుకడిగిన ముత్యాలే..! కొత్త చట్టంలో రూల్స్ ఇవే..!

దేశచరిత్రలో టెండర్ల ప్రక్రియలో పారదర్శక విధానానికి ఏపీ సీఎం శ్రీకారం చుట్టారు. జ్యుడిషియల్‌ కమిషన్‌ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయాన్ని అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగుగా మంత్రివర్గం అభివర్ణించింది. ప్రాజెక్టులు, ప్రభుత్వ పనుల టెండర్లలో పక్షపాతం, గందరగోళం, ప్రజా ధనం లూటీ, అవినీతికి అడ్డుకట్టకు ఈ సంస్కరణ ఉపయోగపడుతుందని.. ప్రభుత్వం చెబుతోంది.

మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ .. బిల్లులును తీసుకొచ్చారు. ఈ జ్యూడిషియన్ కమిషన్‌లో… హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి ఉంటారు. వారి నేతృత్వంలో టెండర్ల పరిశీలన జరుగుతుంది. అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఖర్చువిషయంలో జాగ్రత్త పాటించడమే లక్ష్యాలుగా.. టెండర్ల పరిశీలన జరుగుతుందని.. ముఖ్యమంత్రి చెబుతున్నారు. హైకోర్టు జడ్జి లేదా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి పరిధిలోకి రూ.100 కోట్లకు పైబడ్డ అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పనిని ప్రతిపాదిస్తున్న ప్రతి శాఖ ఆ పత్రాలను సమర్పించాల్సిందేనని బిల్లులో నిబంధన పెట్టారు. టెండర్లను పిలవడానికి ముందుగానే అన్ని పీపీపీ, జాయింట్‌వెంచర్లు, స్పెషల్‌ పర్సస్‌ వెహికల్స్‌ సహా అన్ని ప్రాజెక్టులపైనా జడ్జి పరిశీలన చేయాలని చట్టంలో ఉంది.

పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పనివిలువ రూ.100 కోట్ల దాటితే.. జడ్జి పరిధిలోకి రావాల్సిందేనని చట్టంలో నిర్దేశించారు. జడ్జికి సహాయంగా నిపుణులను ప్రభుత్వం నియమిస్తుంది. అవసరమైన నిపుణులను జడ్జి కూడా కోరవచ్చునని చట్టంలో పేర్కొన్నారు. మొదటగా వారం రోజులపాటు ప్రజలు, నిపుణుల పరిశీలనకు పనుల ప్రతిపాదనలు ఉంచుతారు. ఆ తర్వాత జడ్జి పరిశీలనకు పంపుతారు. జడ్జి చేసే సిఫార్సులను తప్పనిసరిగా సంబంధిత శాఖ పాటించాల్సిందేనని.. చట్టంలో స్పష్టం చేశారు. మొత్తం 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదన ఖరారవుతుందని.. ఆతర్వాతే బిడ్డింగ్‌ జరపాలని.. చట్టంలో పేర్కొన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, పనిగట్టుకుని ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. దాన్ని నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకునేలా జడ్జికి అవకాశం ఇవ్వాలని చట్టం నిర్ణయించింది. జడ్జి, జడ్జి దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని పబ్లిక్‌ సర్వెంట్లుగా భావిస్తారు, దీనివల్ల వారికి రక్షణ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

అంతా బాగానే ఉన్నా…అసలు జ్యూడిషియల్ కమిషన్‌కు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వం వహిస్తారని చట్టంలో పేర్కొన్నారు. నేరుగా హైకోర్టు జడ్జి నేతృత్వం వహిస్తే.. అది జ్యూడిషియల్ కమిషన్ అవుతుంది కానీ… రిటైర్డ్ జడ్జి నాయకత్వం వహిస్తే.. అది జ్యూడిషియల్ కమిషన్‌ అయ్యే అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు. జడ్జిలు ఇలాంటి పనుల్లో పాలు పంచుకోరని.. అందుకే వెసులుబాటు కోసమే రిటైర్డ్ జడ్జి పేరును తెరపైకి తెచ్చారని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close