అస‌లే ల్యాగ్ అనుకుంటే.. ఇంకో సీన్ క‌లుపుతున్నారు

స‌రిలేరు నీకెవ్వ‌రులో – ట్రైన్ ఎపిసోడ్ పేలుతుంద‌ని ఓ రేంజులో ఊహించుకున్నారు సినీ జ‌నాలు. దానికి తోడు ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరో కూడా `అట్టా ఇట్టా ఉండ‌ద‌ది` అన్న‌ట్టే మాట్లాడారు. తీరా చూస్తే ట్రైన్ ఎపిసోడు తుస్సుమంది. ఆ స‌న్నివేశాలు ఇంకాస్త బెట‌ర్‌గా ఉంటే, ఈ సినిమా ఫ‌లితం మ‌రో మెట్టు పైనే ఉండేది. ట్రైన్ ఎపిసోడ్ అనుకున్నంత స్థాయిలో న‌వ్వించ‌లేద‌ని, నిడివి కూడా ఎక్కువే ఉంద‌న్న విమ‌ర్శ‌లు వినిపించాయి.

అయితే వ‌సూళ్లు బాగుండి, సినిమా హిట్ట‌యిపోవ‌డంతో – ఇవేం ప‌ట్టించుకోలేదు చిత్ర‌బృందం. స‌రిక‌దా.. ఇప్పుడు ట్రైన్ ఎపిసోడ్‌లోనే మ‌రో సీన్ కూడా పెంచుతోంది. మ‌హేష్ బాబు – రావు ర‌మేష్‌ల మ‌ధ్య‌న దాదాపు 90 సెక‌న్ల నిడివి ఉన్న ఈ స‌న్నివేశాన్ని శుక్ర లేదా శ‌నివారం నుంచి థియేట‌ర్ల‌లో క‌లుపుతున్నారు. రిపీట్ ఆడియ‌న్స్‌ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి ఈ సీన్ బాగా ఉపక‌రిస్తుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. శుక్ర‌వారం నుంచి డిస్కోరాజా హ‌డావుడి మొద‌ల‌వుతుంది. దాన్ని త‌ట్టుకోవ‌డానికి దిల్‌రాజు ఇలా ప్లాన్ చేశాడ‌న్న‌మాట‌. మ‌రి అస‌లే ల్యాగ్ అనుకున్న ట్రైన్ ఎపిసోడ్‌ని ఇంకాస్త పెంచుతున్నారంటే.. ఆయ‌న గ‌ట్స్‌ని మెచ్చుకోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close