వ్యాపారానికి వైరస్ : మొదటి విక్టిమ్ న్యూస్‌పేపర్ ఇండస్ట్రీ..!

వైరస్ ఇప్పుడు ప్రపంచ ప్రజల్నే కాదు.. ఆర్థిక వ్యవస్థనూ పట్టుకుంది. కుంగి కృశించిపోయేలా చేస్తోంది. ఇది అంతిమంగా ప్రపంచ ఆర్థిక ఆరోగ్యాన్ని దెబ్బతీయబోతోంది. ఆ ఎఫెక్ట్ ఇప్పటికే అనేక రంగాలపై కనిపిస్తోంది. ఆర్థిక రంగంపై వైరస్ చూపిస్తున్న ప్రభావంపై రోజువారీ విశ్లేషణను తెలుగు 360 అందిస్తోంది. ప్రపంచం మొత్తం.. ఎక్కడిదక్కడ స్తంభించిపోయింది. రోజువారీ కూలీ దగ్గర్నుంచి ప్రపంచంలో అత్యంతధనవంతుడు అనుకునే వ్యక్తి వరకూ ప్రతి ఒక్కరిపై ఈ ఎఫెక్ట్ పడుతోంది. ఎవరి స్థాయిలో వారు నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని అంచనా వేయడం ఇప్పుడే సాధ్యం కాదు. ఎందుకంటే.. అసలు విలయం ప్రారంభమయింది..

కూసాలు కదిలిపోతున్న న్యూస్ పేపర్ ఇండస్ట్రీ..!

వైరస్ ప్రభావం చూపిస్తున్న మొదటి రోజుల్లో చావుదెబ్బ తిన్న పరిశ్రమలు కొన్నే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి..న్యూస్ పేపర్ ఇండస్ట్రీ. ఒక్క ప్రకటన లేకుండా.. పత్రికను నడిపించాల్సిన పరిస్థితి వాటికి వచ్చింది. సాధారణంగా.. సంక్షోభాలు తలెత్తినప్పుడు… మిగతా అన్ని పరిశ్రమలకూ కష్టం వస్తుందేమో కానీ.. న్యూస్ పేపర్ ఇండస్ట్రీకి మాత్రం.. పండగ వస్తుంది. ఎందుకంటే ప్రజలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి … తమ నిత్యావసర వస్తువుగా.. పత్రికను కొనేవాళ్లు. ఆ కారణంగా.. పత్రికల సేల్స్ పెరగడమే కాదు.. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా వ్యాపార సంస్థలు ఇచ్చేవి. కానీ ఇప్పుడు వచ్చిన విలయం మాత్రం.. మొదటగా న్యూస్ పేపర్ ఇండస్ట్రీని దెబ్బకొట్టింది. పేపర్ల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఓ రూమర్ ని సోషల్ మీడియాలో కొంత మంది జనంలోకి ఎక్కించడంతో పడిన దెబ్బ.. ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా.. ఆగిపోయిన ఆర్థిక వ్యవస్థతో మరింత గట్టిగా పడింది.

ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నంలో వైరస్ దెబ్బ..!

దినపత్రికలు ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాయి. న్యూస్ ప్రింట్ ధరలు పెరగడం మాత్రమే కాదు.. రాను రాను పాఠకులు తగ్గిపోతున్నారు. ఉదయమే.. న్యూస్ పేపర్ చదివే అలవాటు… తగ్గిపోతోంది. అందరూ.. సోషల్ మీడియా న్యూస్‌కు ఎడిక్ట్ అవతున్న సందర్భం ఇది. ఇలాంటి సమయంలో పాఠకుల్ని ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాను మించిన విశ్వసనీయత చూపి… సర్వైవ్ అవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. కానీ వైరస్ మొదటికే మోసం తెచ్చింది. ఇప్పుడు వైరస్ భయంలో పత్రికలు కొనేవాళ్లు సగానికి సగం తగ్గిపోతే… ప్రకటనలు పూర్తిగా ఆగిపోయాయి.

ప్రకటనలు నిల్… 80 శాతం ఆదాయం డౌన్..!

పత్రికలకు రెండు రకాలుగా ఆదాయం వస్తుంది. పత్రిక అమ్మకం ద్వారా వచ్చేది… ప్రకటనల ద్వారా వచ్చేది. పత్రిక అమ్మకం ద్వారా వచ్చేది స్వల్పమే. ఓ పత్రిక మార్కెట్లోకి వచ్చే సరికి రూ. 20 వరకూ ఖర్చు అవుతుంది. కానీ.. దాన్ని రూ. ఆరుకే పాఠకులకు అందిస్తారు. మిగతా మొత్తం.. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కవర్ చేసుకుంటారు. అందులోనే లాభాలు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు.. ఖర్చు తగ్గకపోగా.. ప్రకటనల ఆదాయం పూర్తిగా పడిపోయింది. వ్యాపారాలు.. ఏమీ నడిచే పరిస్థితి లేకపోవడంతో.. ఎవరూ ప్రకటనలు ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు కూడా.. ప్రకటనలు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే.. ఆదాయంలో దాదాపుగా 80 శాతం వరకూ న్యూస్ పేపర్ ఇండస్ట్రీ కోల్పోతోంది.

వైరస్‌కు బలి అయ్యే మొదటి పరిశ్రమ “న్యూస్ పేపర్”..!?

ప్రస్తుత సంక్షోభం ఎంత కాలం ఉంటుందో తెలియదు. కరోనాపై విజయం సాధించే సరికి… ఆర్థిక మూలాలు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. ఇప్పటికే వీలైనంత వరకూ.. సర్వైవ్ కావడానికి పేజీలు తగ్గించి.. పత్రికలు పోరాడుతున్నాయి. ముందు ముందు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అంచనా వేయడం కష్టం. వైరస్ ప్రభావం ఎంత ఎక్కువ పెరిగితే.. అంత మొదటగా దెబ్బపడేది పత్రికా రంగంపైనే. విక్టిమ్‌గా మారేది ఆ ఇండస్ట్రీనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close