“బాక్సైట్” మైనింగ్‌పై ఎన్జీటీ కఠిన చర్యలు..! కానీ …

తూర్పుగోదావరి. విశాఖ మన్యం ప్రాంతాల్లో కొంత కాలంగా బాక్సైట్ మైనింగ్ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తవ్వి తీసుకెళ్తున్నారని దీని కోసం రక్షిత అటవీ ప్రాంతంలో రోడ్డు కూడా వేశారని విపక్ష నేతలు ఆరోపించారు. వారు వెళ్లి అడవిలో పరిశీలన చేసి వచ్చే సమయంలో పోలీసులు అరెస్టులు కూడా చేశారు. ఇప్పుడీ అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో పిటిషన్ దాఖలు కావడంతో… విచారణ జరిపిన ఎన్జీటీ.. కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌పై విచారణ కమిటీని నిమయమించింది. మైనింగ్‌ పేరుతో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా ఎన్జీటీ నిర్ధారరణకు వచ్చింది.

అనుమతించిన పరిధి దాటి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో అక్రమ మైనింగ్‌ చేశారని గుర్తించింది. అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధ్యులైన అధికారుల నుంచి పరిహారం వసూలు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలో కేంద్ర అటవీశాఖ, రాష్ట్ర గనులశాఖ, పీసీబీ అధికారులు, విశాఖ కలెక్టర్‌ సభ్యులుగా ఉండనున్నారు. అక్రమ మైనింగ్‌ జరిగిన ప్రాంతంలో పర్యటించి మైనింగ్‌ అనుమతులు, పరిధి, రోడ్డు నిర్మాణం, అక్రమ మైనింగ్‌పై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.

అయితే కమిటీ ఆదేశాలు చాలా కఠినంగా ఉన్నాయి కానీ అమలు చేయాల్సింది ఏపీ ప్రభుత్వం. ఎన్జీటీని ఏపీ ప్రభుత్వం పట్టించుకుంటున్న సూచనలు లేవు. ఇటీవల.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో తనిఖీలు చేయాలని ఆదేశించినా ఏపీ సర్కార్ సహకరించలేదు. ఇప్పుడు మైనింగ్ విషయంలోనూ.. ఏపీ అధికార పార్టీకి చెందిన వారిపైనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈఆదేశాలను ఆయినా ప్రభుత్వం పాటిస్తుందో లేదో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు చేయవద్దని రేవంత్‌కు కోర్టు ఆదేశం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను వారించిన కోర్టు ఇక పై ఈడీ...

షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు – డబ్బులివ్వలేదని కూలీల ఆందోళన

నిరుద్యోగ ఉద్యమంలో భాగంగా ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షను ఈ వారం హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ లో చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతించలేదు. ఆమె...

అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరట !

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫార్సు చేసింది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల...

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

HOT NEWS

[X] Close
[X] Close