ఎన్జీటీ దృష్టిలో జన్వాడ్ ఫామ్‌హౌస్‌ను పెట్టిన రేవంత్ రెడ్డి..!

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నోటీసులు జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిగా ఆయనకు ప్రభుత్వ వ్యవహారాల్లో భాగంగా నోటీసులు రాలేదు. వ్యక్తిగతంగా.. జన్వాడ గ్రామంలో నిర్మించిన ఫామ్‌హౌస్ విషయంలో ఈ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. జన్వాడ ఫామ్‌హౌస్‌ను.. జీవో నెంబర్ 111కి విరుద్ధంగా.. పర్యావరణ నిబంధనలకు ఉల్లంఘించి కట్టారని ఆరోపిస్తూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌కు ఫిర్యాదు చేయడమే. జన్వాడ గ్రామంలో కేటీఆర్‌కు ఓ ఫామ్ హౌస్ ఉంది. కరోనా లాక్ డౌన్ కంటే ముందుగా.. రేవంత్ రెడ్డి ఈ ఫామ్ హౌస్ విషయాన్ని మీడియాను తీసుకెళ్లి వివరించారు. అప్పట్లో ఆయన ఫామ్‌హౌస్‌పై.. డ్రోన్ ఎగరవేసినందుకు పోలీసులు అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టారు. పది రోజుల పాటు ఆయనకు బెయిల్ దక్కలేదు.

అయితే.. ఆయన ఆ తర్వాత కూడా ఆ అంశాన్ని వదిలి పెట్టలేదు. ఖచ్చితంగా జన్వాడ ఫామ్‌హౌస్ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. ఎన్జీటీకి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్జీటీ స్పందించింది. కేటీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం, పీసీబీ, హెచ్ఎండీలకు కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే.. ఓ నిజాల్ని నిర్ధారించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సెంట్రల్ ఎన్విరాన్‌మెంట్ రిజిస్ట్రి ప్రాంతీయ కార్యాలయ అధికారి, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్, హెచ్ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. వీరు రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ఆదేశించింది.

జన్వాడ గ్రామం జీవో నెంబర్ 111 పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్‌కు నీరు అందించే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు నీరు చేరే క్రమంలో అడ్డంకులు ఏర్పడకుండా.. శాశ్వత నిర్మాణాలు కట్టకుండా.. ఆ జీవో పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు పెట్టారు. ఆ ఆంక్షల్ని ఉల్లంఘించి కేటీఆర్ భారీ ఫామ్‌హౌస్ నిర్మించారని.. రేవంత్ రెడ్డి ఆరోపణ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018...

ఎన్నికలు నిర్వహణ వద్దంటున్న వైకాపా

దేశంలో కరోనా లాక్ డౌన్ విధించినప్పుడు ఎన్నికలు వాయిదా వేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కులం పేరు పెట్టి మరీ బూతులు తిట్టిన మంత్రులు ఇప్పుడు.. అదే రమేష్ కుమార్ ఎన్నికలు పెడతానంటే...

అమరావతిలో “రియల్ పెయిడ్ ఉద్యమం” స్టార్ట్..!

అమరావతిలో పోటీ ఉద్యమాలు జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులు లాఠీదెబ్బలకు ఓర్చుకుని పోరాటం చేస్తూంటే.. వారికి పోటీగా కొంత మంది ఇప్పుడు ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతుల సభ...

తిరుపతిలో బీజేపీ పోటీ ఖాయం.. కానీ అభ్యర్థి మాత్రం పక్క పార్టీ నుంచి..!

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసి.. తాము ఏపీలో బలపడ్డామని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉబలాట పడుతోంది. ముఖ్యంగా ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్‌గా ఉన్న సునీల్ ధియోధర్ తాను.. పార్టీని...

HOT NEWS

[X] Close
[X] Close