బాల‌య్య బ‌ర్త్ డే గిఫ్టు లేన‌ట్టేనా?

ఈనెల 10న నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు. సాధార‌ణంగా స్టార్‌హీరోల పుట్టిన రోజుల‌కు వాళ్ల కొత్త సినిమాల‌కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్కో, టీజ‌రో విడుద‌ల అవుతాయ‌ని అభిమానులు ఆశిస్తుంటారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా త‌మ సినిమా ప్ర‌చారానికి అదే సుముహూర్త‌మ‌ని భావిస్తుంటారు. ప్ర‌స్తుతం బాల‌య్య బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించిన టైటిల్ బ‌య‌ట‌కు వ‌స్తుందేమో అన్న‌ది అంద‌రి ఆశ‌. అయితే.. పుట్టిన రోజున ఇలాంటి ఆర్భాటాలేం వ‌ద్ద‌ని బాల‌య్య బోయ‌పాటికి చెప్పేశాడ‌ట‌. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌డానికి కూడా బాల‌య్య ఒప్పుకోవ‌డం లేద‌ని టాక్‌. ఇది వ‌ర‌కు బాల‌య్య‌పై కొన్ని ఫొటో షూట్లు నిర్వ‌హించారు. వాటికి సంబంధించిన స్టిల్స్ ఫ‌స్ట్ లుక్‌గా విడుద‌ల చేయాల‌ని బోయ‌పాటి భావించారు. అయితే… ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నం విరమించుకున్న‌ట్టు తెలుస్తోంది. టైటిల్ విష‌యంలో బోయ‌పాటి ఇంకా ఓ క్లారిటీకి రాలేద‌ని స‌మాచారం. అందుకే టైటిల్‌నీ చెప్ప‌డం లేదు. సో.. ఈ ష‌ష్టిపూర్తి నాడు బాల‌య్య కొత్త సినిమాకు సంబంధించిన వార్త‌లేం బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాల్లేన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close