హీరోయిన్ కి ప‌బ్లిసిటీ పిచ్చి

ప‌బ్లిసిటీ విష‌యంలో సింప్లిసిటీ వ‌దిలేశారు సినిమా వాళ్లు. ఎంత ప‌బ్లిసిటీ ఉంటే అంత క్రేజ్ ఉన్న‌ట్టులెక్క‌లేసుకుంటున్నారు. ప‌బ్లిసిటీ కోసం సొంతంగా జేబులో డ‌బ్బులు పెట్ట‌డానికైనా వెనుకంజ వేయ‌డం లేదు. సాధార‌ణంగా ఈ ప‌బ్లిసిటీ పిచ్చి హీరోల‌కు ఉంటుంది. కానీ.. ఇప్పుడు హీరోయిన్లూ ఏం త‌క్కువ చేయ‌డం లేదు. ఈ విష‌యంలో మిగిలిన‌వాళ్ల సంగ‌తేమో గానీ, నిధి అగ‌ర్వాల్ మాత్రం ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకుంటోంది. ఇటీవ‌ల `హీరో` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది నిధి. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా త‌ను ఎక్క‌డ పాల్గొన్నా… నిధి ఫ్యాన్స్ అంటూ కొంత‌మంది వ‌చ్చి హంగామా చేస్తున్నారు. టీ ష‌ర్ట్ పై నిధి బొమ్మ‌ని ముద్రించుకుని 20 – 30 మంది పోగ‌డిపోతున్నారు. వాళ్లంతా `నిధి… నిధి` అంటూ సినిమా వేడుక‌లో గోల గోల చేస్తున్నారు. ఇదంతా నిధి అరంజ్ చేసుకున్న సెట‌ప్పే. ఇలాంటి ప్ర‌మోష‌న్ల కోసం నిధి గ‌ట్టిగానే ఖర్చు పెడుతోంద‌ని టాక్‌. వారంద‌రికీ నిధి రోజువారీ బేటాలు ఇస్తోంద‌ట‌. అంతే కాదు.. `హీరో` సినిమా విడుద‌ల‌కు ముందు, ఆ త‌ర‌వాత కూడా ప్ర‌త్యేకంగా పార్టీలు ఇస్తోంద‌ట‌. నిధి ఇంట‌ర్వ్యూల‌న్నీ ఈమ‌ధ్య ప్ర‌తీ టీవీ ఛాన‌ల్ లోనే క‌నిపించాయి. వీటిలో స‌గం… `హీరో` పీఆర్ టీమ్ ఎరైంజ్ చేస్తే… స‌గం… నిధి పీఆర్వోలు ఏర్పాటు చేశారు. `న‌న్ను ఈ ప్ర‌శ్న‌లు అడ‌గండి` అంటూ ఇంట‌ర్వ్యూ చేస్తున్న రిపోర్ట‌ర్ల‌కే.. కొన్ని లీకులు ఇచ్చి మ‌రీ… స‌మాధానాలు చెబుతోంది నిధి. ఇదో కొత్త‌ర‌కం ప‌బ్లిసిటీ ట్రిక్కు. `నిధికి ప‌బ్లిసిటీపై ఇంత పిచ్చి ఎందుకొచ్చిందో` అంటూ `హీరో` టీమ్ కూడా ముక్కున వేలేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన...

అనంతబాబు సస్పెన్షన్ – గౌతంరెడ్డిని చేసినట్లుగానేనా!?

ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై...

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close