ప‌వ‌న్ డెడ్ లైన్‌: ప్ర‌తీ సినిమాకీ అర‌వై రోజులే

2024లో ఎన్నిక‌ల ఘంటారావం మోగ‌నుంది. 2023లోనే ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయంటూ… రాజ‌కీయ వ‌ర్గాలు జోస్యం చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో మ‌రోసారి చ‌క్రం తిప్ప‌డానికి స‌మాయాత్తం అవుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమా – రాజ‌కీయం అంటూ రెండు ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణం చేస్తున్న ప‌వ‌న్‌… త్వ‌ర‌లో పూర్తి స్థాయి రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర పోషించాల్సివుంటుంది. అయితే ఈమ‌ధ్య‌లో చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయ‌డం పెద్ద టాస్క్‌.

ప‌వ‌న్ కూడా అందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లు వేసుకున్న‌ట్టు స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. భీమ్లా నాయ‌క్ ప‌ని అయిపోయింది. `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` సినిమా స‌గం పూర్త‌య్యింది. ఈ చిత్రానికి మ‌రో 40 రోజులు కాల్షీట్లు ఇస్తే స‌రి. అందుకే ఏక ధాటిగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడ‌ట‌. ఆ త‌ర‌వాత హ‌రీష్ శంక‌ర్ సినిమా లైన‌ప్ లో ఉంది. ఆ సినిమాకి ప‌వ‌న్ 60 రోజులు కేటాయించ‌బోతున్నాడ‌ట‌. రెండు నెలల్లో సినిమాని పూర్తి చేసుకోవాల‌ని హ‌రీష్ శంక‌ర్‌కు డెడ్ లైన్ విధించాడ‌ని తెలుస్తోంది. హ‌రీష్ కూడా వేగంగా సినిమాలు తీయ‌డంలో దిట్ట‌. కాక‌పోతే… సురేంద‌ర్ రెడ్డి ద‌గ్గ‌రే స‌మస్య‌. సూరితో కూడా ప‌వ‌న్ ఓ సినిమా చేయాలి. అందుకు సంబంధించిన అడ్వాన్సులు కూడా తీసేసుకున్నాడు. సూరికి కూడా 60 రోజుల్లో సినిమాని లాగించేయాల‌ని టార్గెట్ పెట్టాడ‌ట‌. సూరి చేతిలో `ఏజెంట్` ఉంది. అది పూర్త‌య్యేలోగా ప‌వ‌న్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`తో పాటుగా హ‌రీష్ శంక‌ర్ సినిమానీ అవ్వ‌గొట్టాలి. ప‌వ‌న్ ప్లాన్ ఏమిటంటే… 2022లో మూడు సినిమాల్ని ఫినిష్ చేయాలి. అందుకోసం ఎలాంటి గ్యాప్ తీసుకోకూడ‌ద‌ని భావిస్తున్నాడ‌ట‌. 2022లోగా సినిమాలు పూర్త‌యితే 2023 మొత్తం రాజ‌కీయాల‌కు
కేటాయించొచ్చు. ఇదీ ప‌వ‌న్ ప్లాన్‌. కాక‌పోతే… 60 రోజుల్లో సినిమాని పూర్తి చేయ‌డం మాత్రం.. ద‌ర్శ‌కుల‌కు పెద్ద టాస్కే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close