తెలంగాణ ప్రభుత్వఖాతానుంచి రు.95 లక్షలు దోచేసిన నైజీరియన్లు

హైదరాబాద్:  నైజీరియన్ల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సాధారణ పౌరులనే ఇప్పటివరకు బుట్టలో పడేసి డబ్బులు దోచేసే నైజీరియన్లు తాజాగా ఏకంగా ప్రభుత్వఖాతానే హ్యాక్ చేసి రు.95 లక్షలు కొల్లగొట్టిన ఘటన వెలుగులోకొచ్చింది. తెలంగాణ మీ-సేవ సర్వీసుల డిప్యూటీ డైరెక్టర్ మధుసూదనరెడ్డి ఈ-మెయిల్‌ను హ్యాక్ చేశారు. మీసేవ నిధులు డిపాజిట్ చేసిఉన్న యాక్సిస్ బ్యాంకుకు మధుసూదనరెడ్డి పంపినట్లుగా 4 మెయిల్స్ పంపి, ఫలానా ఖాతాలలో రు.1.54 కోట్లను జమ చేయాల్సిందిగా కోరారు. బ్యాంక్ అధికారులు అదేవిధంగా ఆ మొత్తాలను జమ చేశారు. గంటల వ్యవధిలోనే ఆ నిధులను నైజీరియన్లు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఒక బ్యాంక్‍‌కు చెందిన అధికారులకు అనుమానం వచ్చి రు.30 లక్షలు నిలిపేశారు. మరో బ్యాంక్ అధికారులు హైదరాబాద్‌‍లోని యాక్సిస్ బ్యాంకుకు ఫోన్ చేసి రు.29 లక్షల చెల్లింపులు చెల్లింపులు ఆపాల్సిందిగా అభ్యర్థించటంతో ఆ మొత్తాన్ని ఆపేశారు. అయితే నైజీరియన్లు అప్పటికే రు.95 లక్షలు విత్‌డ్రా చేసేశారు. వీరి ఖాతాలు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో ఉన్నట్లు తర్వాత తెలిసింది. వీరిని పట్టుకోవటానికి సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్ళారు.

మరోవైపు, నైజీరియన్లు ఇటీవల పెళ్ళిసంబంధాల వెబ్‌సైట్లలోకుకూడా దూరి మోసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లండన్ సిటిజన్, డాక్టర్, ఎన్ఆర్ఐలుగా పరిచయం చేసుకుని హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులకు చెందిన యువతులను మోసం చేసి రు.77 లక్షలు దోచుకున్న వైనం నిన్న బయటపడింది. ఈ మోసానికి పాల్పడిన ఇద్దరు నైజీరియన్లు, ఒక నాగాల్యాండ్ యువతిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close