పరిషత్ ఎన్నికల నిర్వహణపై వెనక్కి తగ్గిన ఎస్‌ఈసీ..!?

మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న ఎస్‌ఈసీ ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తి చేస్తారని అందరూ అనుకున్నారు. ఇటీవల ఆ ఎన్నికకు సంబంధించి ఓ సర్క్యూలర్ కూడా విడుదల చేశారు. బలవంతపు ఏకగ్రీవాల విషయంలో ఫిర్యాదులు చేయాలని సూచనలు చేశారు. అలాంటి వాటిపై విచారణ కూడా చేయించాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం ఈ అంశంపై కోర్టుకు వెళ్లింది. ఏకగ్రీవాలు అయిన చోట… విచారణ జరపకూడదని కోర్టును ఆశ్రయించింది. కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల అధికారులు ఫామ్ -10 ఇచ్చి ఉంటే వాటిపై విచారణ వద్దని ఆదేశించింది.

అయితే ఇవి మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే… మళ్లీ విచారణ సమయంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి తుది ఉత్తర్వులు ఇస్తారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వివరాలను మీడియాకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టిన నిమ్మగడ్డ… పరిషత్ ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నట్లుగా మాట్లాడారు. న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని.. అవి పూర్తయిన తర్వాతనే ఆలోచిస్తామన్నారు. లేకపోతే.. వాయిదా వేస్తామన్నట్లుగా ఆయన సమాధానం ఉంది.

పంచాయతీల్లో మొత్తంగా స్వీప్ చేసేశామని చెబుతున్న ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలపై విచారణ జరిపితే ఉలిక్కి పడటం.. విపక్షాల విమర్శలకు కారణం అవుతోంది. బలవంతపు ఏకగ్రీవాలు కాకపోతే.. ఎందుకు కంగారు పడతారని ప్రశ్నిస్తోంది. పరిస్థితి చూస్తూంటే.. నిమ్మగడ్డ మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసి.. పరిషత్ ఎన్నికల బాధ్యతను తర్వాత కమిషనర్‌కు అప్పగించి.. రిటైర్ అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ ఫ్యాన్‌పై రాజద్రోహం, యుద్ధం కేసులు … బెయిలిచ్చిన కోర్టు!

ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వామిభక్తిలో ఎవరూ అందుకోనంత స్థాయికి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని జనసేన సానుభూతి పరుడైన ఓ యువకుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పెట్టిన సెక్షన్లు చూసి న్యాయమూర్తే...

తెరపైకి మళ్లీ దళిత బంధు !

హుజురాబాద్ ఎన్నికలు అయిపోయిన రెండున్నర నెలల తర్వాత దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ మరో ప్రకటన చేశారు. నిజానికి గత డిసెంబర్‌లోపే హుజురాబాద్‌తో పాటు నాలుగు దిక్కులా ఉన్నా నాలుగు మండలాల్లో...

“బండి”కి న్యాయం.. నాకు అన్యాయమా ?: రఘురామా

బండి సంజయ్‌పై పోలీసుల దాడిని లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సీరియస్‌గా తీసుకుంది. ఆ ఘటనకు కారణమైన వారందర్నీ పిలిపించి ప్రశ్నించబోతోంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్...

గుడివాడ కేసినో ఆధారాలు రిలీజ్ చేసిన టీడీపీ !

గుడివాడలో కేసినో నిర్వహించామని నిర్వహిస్తే అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. అయితే కేసినో నిర్వహించారన్నదానికి అన్ని ఆధారాలూ సమర్పిస్తామని టీడీపీ చెబుతోంది. ముందుగా కేసినో నిర్వాహకులు.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close