సిటీమార్ టీజ‌ర్: క‌బ‌డ్డీ ఆట కాదు… వేట‌

స్పోర్ట్స్ డ్రామాలో ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా సినిమాలొచ్చాయి.కాక‌పోతే.. స్పోర్ట్స్‌నీ, క‌మ‌ర్షియాలిటీని మిక్స్ చేసిన‌వి కొన్నే. అలాంటి క‌థ‌లే.. హిట్లు కొట్టాయి. `సిటీమార్‌` టీజ‌ర్ చూస్తుంటే… ఈ మిక్సింగ్ ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరింద‌నిపిస్తోంది. గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. త‌మ‌న్నా నాయిక‌. సంప‌త్ నంది ద‌ర్శ‌కుడు. క‌బ‌డ్డీ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది,. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది.

టీజ‌ర్ లో క‌బ‌డ్డీ షాట్స్ కంటే.. యాక్ష‌న్ ఫీట్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మంచి యాక్ష‌న్ ఎపిసోడ్లు కుదిరిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. `మైదానంలో ఆడితే ఆట – బ‌య‌ట ఆడితే వేట‌` అనే గోపీచంద్ డైలాగ్ ని బ‌ట్టి… ఆట‌, వేట రెండూ ఈ సినిమాలో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశాడు ద‌ర్శ‌కుడు.

“న‌న్నెవ‌డైనా అలా పిల‌వాటంటే ఒక‌టి నా ఇంట్లో వాళ్లు పిల‌వాలి. లేదంటే నా ప‌క్క‌నున్న స్నేహితులు పిల‌వాలి. ఎవ‌డు ప‌డితే వాడు పిలిస్తే… వాడి కూత ఆగిపోద్ది“ అనేది… `రామ‌య్యా వ‌స్తావ‌య్యా`లో ఎన్టీఆర్ డైలాగ్‌లా ఉంది. అది కావాల‌ని పెట్టారా? లేదంటే.. దాన్ని మ‌ర్చిపోయి డైలాగ్ గా రాశారా? అన్న‌ది సినిమా చూస్తేగానీ అర్థం కాదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, టీజ‌ర్లో క‌నిపించే షాట్స్, మేకింగ్ క్వాలిటీ.. ఇవ‌న్నీ హోరెత్తించేలా ఉన్ఆయి. మొత్తానికి ఓ యాక్ష‌న్ ప్యాక్డ్ స్పోర్ట్స్ డ్రామా చూడ‌బోతున్నామ‌న్న హింట్ మాత్రం ఈ టీజ‌ర్ ఇచ్చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.