ఎక్స్‌క్లూజీవ్‌: ‘పెళ్లి సంద‌D’ హీరో… రాఘ‌వేంద్ర‌రావు

శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడిగా రాఘ‌వేంద్ర‌రావు కీర్తి గ‌డించారు. ఇప్పుడాయ‌న‌కు న‌ట‌న‌పై ఆసక్తి క‌లిగింది. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో రాఘ‌వేంద్ర‌రావు హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. దాంతో ద‌ర్శ‌కేంద్రుడు న‌టుడిగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అంత‌కంటే ముందుగా రాఘ‌వేంద్ర‌రావు తెరంగేట్రం చేసేస్తున్నారు. `పెళ్లి సంద‌డి` సినిమాతో.

రాఘ‌వేంద్ర‌రావు తీసిన సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో.. పెళ్లి సంద‌డి ఒక‌టి. ఈ సినిమాతో శ్రీ‌కాంత్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ తో న‌యా `పెళ్లి సంద‌డి`కి శ్రీ‌కారం చుట్టారు. ఈ చిత్రానికి రాఘ‌వేంద్ర‌రావు శిష్యురాలు గౌరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. రాఘేవేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప‌రిమిత‌మ‌య్యారు. అయితే.. ఇప్పుడు తేలిన విష‌యం ఏమిటంటే… ఈ సినిమాలో హీరో రోష‌న్ కాదు. రాఘ‌వేంద్ర‌రావే. ఆయ‌న కోణంలోనే క‌థ న‌డుస్తుంద‌ని తెలుస్తోంది. రాఘ‌వేంద్ర‌రావు య‌వ్వ‌నంలో ఉండే పాత్ర‌ని రోష‌న్ పోషిస్తున్నాడ‌ట‌. అంటే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ నేరేష‌న్ లో సాగ‌బోతోంద‌న్న‌మాట‌. `తీన్ మార్‌`లో ప‌రేష్ రావ‌ల్ ఫ్లాష్ బ్యాక్‌లోకి… ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చిన‌ట్టు, ఇక్క‌డ‌.. రాఘ‌వేంద్ర‌రావు ఫ్లాష్ బ్యాక్‌లో రోష‌న్ వ‌స్తాడ‌న్న‌మాట‌. సో.. ద‌ర్శ‌కేంద్రుడి న‌ట‌నా అగ‌రంగేట్రం.. `పెళ్లి సంద‌డి`తో షురూ కాబోతోందనుకోవొచ్చు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. రోష‌న్ త‌దిత‌రుల‌పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ ఫ్యాన్‌పై రాజద్రోహం, యుద్ధం కేసులు … బెయిలిచ్చిన కోర్టు!

ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వామిభక్తిలో ఎవరూ అందుకోనంత స్థాయికి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని జనసేన సానుభూతి పరుడైన ఓ యువకుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పెట్టిన సెక్షన్లు చూసి న్యాయమూర్తే...

తెరపైకి మళ్లీ దళిత బంధు !

హుజురాబాద్ ఎన్నికలు అయిపోయిన రెండున్నర నెలల తర్వాత దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ మరో ప్రకటన చేశారు. నిజానికి గత డిసెంబర్‌లోపే హుజురాబాద్‌తో పాటు నాలుగు దిక్కులా ఉన్నా నాలుగు మండలాల్లో...

“బండి”కి న్యాయం.. నాకు అన్యాయమా ?: రఘురామా

బండి సంజయ్‌పై పోలీసుల దాడిని లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సీరియస్‌గా తీసుకుంది. ఆ ఘటనకు కారణమైన వారందర్నీ పిలిపించి ప్రశ్నించబోతోంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్...

గుడివాడ కేసినో ఆధారాలు రిలీజ్ చేసిన టీడీపీ !

గుడివాడలో కేసినో నిర్వహించామని నిర్వహిస్తే అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. అయితే కేసినో నిర్వహించారన్నదానికి అన్ని ఆధారాలూ సమర్పిస్తామని టీడీపీ చెబుతోంది. ముందుగా కేసినో నిర్వాహకులు.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close