వైసీపీ వైపు సీపీఎం.. ఎన్నికల వైపు మిగతా పార్టీలు..!

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్టీల అభిప్రాయాలు సేకరించారు. అధికార పార్టీ వైసీపీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. హాజరైన పార్టీల్లో ఒక్క సీపీఎం మినహా మిగిలిన అన్ని పార్టీలు దాదాపుగా ఒకే వాదన వినిపించాయి. ఎన్నికలు పెట్టాలని..మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ నిర్వహించాలని కోరాయి. తెలుగుదేశం పార్టీ మొత్తం ప్రక్రియను.. మొదటి నుంచి కేంద్ర బలగాల భద్రతతో నిర్వహించాలని ఎస్‌ఈసీని కోరింది. గతంలో జరిగిన ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటి వరకూ స్థానిక ఎన్నికలపై బయట పెద్దగా మాట్లాడని బీజేపీ కూడా.. తన అభిప్రాయం.. ఎన్నికల వైపేనని చాలా స్పష్టంగా చెప్పింది. అదీ కూడా మళ్లీ ప్రక్రియ మొదటి నుంచి చేపట్టాలని కోరింది.

బహుజన్ సమాజ్ పార్టీ ప్రతినిధులదీ కూడా అదే మాట. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సీపీఐ కూడా… ఎన్నికలు పెట్టాలని.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలిని లేఖ రూపంలో వినతి పత్రం ఇచ్చింది. జనసేన పార్టీ.. తన ప్రతినిధిని పంపలేదు. కానీ ఈ మెయిల్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియచేసింది. ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపింది. అయితే సీపీఎం మాత్రం.. ఈ విషయంలో… కాస్త వైసీపీకి దగ్గరైన వాదన వినిపించింది. కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పిన ఆ పార్టీ ప్రతినిధులు.. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని కోరారు.

పార్టీల అభిప్రాయాలన్నింటినీ ఎస్‌ఈసీ రమేష్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. వచ్చే నెల నాలుగో తేదీన.., స్థానిక ఎన్నికలకు సంబంధించిన కేసు విచారణ జరగనుంది. గత విచారణలో.. పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు.. నిమ్మగడ్డ… ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“గ్రేటర్‌”లో ఇప్పుడు పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల కూల్చివేత రాజకీయం..!

గ్రేటర్ హైదరాబాద్ ప్రచారం సర్జికల్ స్ట్రైక్స్ నుంచి కూల్చివేతల వరకూ వచ్చింది. ఒకరు పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌ల గురించి మాట్లాడగా.. మరొకరు దారుస్సలాం కూల్చివేత గురించి మాట్లాడుకోవడంతో రగడ మలుపు తిరిగింది....

“గ్యాగ్” ఆర్డర్స్‌పై సుప్రీం స్టే..!

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో ఎఫ్ఐఆర్‌లో విషయాలను మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రచారం చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే.. ఆ...

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

HOT NEWS

[X] Close
[X] Close