రాజధాని రైతులకు బేడీలు వేసిన పోలీసులపై వేటు..!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతికి భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి.. నిబంధనలకు విరుద్ధంగా బేడీలు వేసి.. జైలుకు తరలించిన ఘటనలో ఆరుగురు కానిస్టేబుళ్లను గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ సస్పెండ్ చేశారు. ఇద్దరు రిజర్వ్ ఎస్‌ఐలకు చార్జ్ మెమోలు జారీ చేశారు. నిందితులకు ఇలా బేడీలు వేయడం.. మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదే్శాలు కూడా ఉన్నాయి. మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా రైతులకు బేడీలు వేయకూడదు. సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించేలా పోలీసు చర్యలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.

నిందితులుగా ఉన్న రైతులను ఉగ్రవాదులు, తీవ్రవాదులను తీసుకొచ్చినట్లు చేతులకు బేడీలు వేసి తీసుకురావడంపై ప్రభుత్వంపై అన్ని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. 2017లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ణలో కొంత మంది రైతులు… ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టారు. అప్పట్లో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు బేడీలు వేశారు. రైతుల చేతులకు పోలీస్‌ సిబ్బంది బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లడంపై తీవ్ర దుమారం రేగింది. దీంతో అప్పటి తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ సీరియస్ గా స్పందించారు. ఆర్మ్‌డ్‌ రిజర్వుకు చెందిన ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేశారు. ఇప్పుడు.. అదే తీరుగా గుంటూరు ఎస్పీ ఆరుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు ఎస్‌ఐలపై చర్యలు తీసుకున్నారు.

అయితే ప్రస్తుతం అమరావతి రైతుల్ని ఎంత వేధిస్తే.. పోలీసులకు అంత ప్రోత్సాహం లభిస్తుందన్న ప్రచారం ఉంది. ఈ కారణంగానే రైతుల్ని దారుణంగా పోలీసులు వేధిస్తున్నారని చెబుతున్నారు. ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి రాజధాని రైతులపై జరుగుతున్న దాష్టీకాన్ని ప్రపంచం దృష్టికి వెళ్లకుండా.. చర్యల పేరుతో చేసే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం లేకపోతే.. పోలీసులు ఈ దుస్సాహసానికి ఒడిగట్టరని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close