నిమ్మగడ్డను కలిసిన సీఎస్..! రివర్స్ వాదన..?

స్థానిక ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. పార్టీ పరంగా తన అభిప్రాయం చెప్పడానికి నిరాకరించిన వైసీపీ… అధికారికంగా మాత్రం సీఎస్ నీలం సహానితో నిమ్మగడ్డకు ప్రభుత్వ ఆలోచనను చర్చించేందుకు పంపించింది. ప్రస్తుతం కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్నందున.. మళ్లీ నవంబర్‌లో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంలో లేదని నీలం సహాని చెప్పినట్లుగా తెలుస్తోంది. అందరి అభిప్రాయాలను తెలుసుకుని నిమ్మగడ్డ కోర్టుకు నివేదించే అవకాశం ఉంది.

దేశంలో కరోనా ఎమర్జెన్సీ విధించిన సమయంలో… ఎన్నికలు వాయిదా వేసినప్పుడు.. సీఎస్‌గా నీలం సహానీనే ఉన్నారు. అప్పుడు.. ఎన్నికల వాయిదా వేసినందుకు నీలం సహానీ.. ఎస్‌ఈసీకి ఘాటుగా లేఖలు రాశారు. అది వివాదాస్పదం కూడా అయింది. కరోనా ఉద్ధృతి పెరిగే సరికి ఇంకా చాలా సమయం ఉంటుందని.. ఎన్నికలు నిర్వహించాలని ఆ లే్ఖల్లో పేర్కొన్నారు. ఎస్‌ఈసీకీ సీఎస్ ఇలా లేఖ రాయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమన్న చర్చ జరిగింది. ఇప్పుడు మాత్రం రివర్స్‌లో నీలం సహానీ… ఎన్నికలు నిర్వహించవద్దని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఉదయం రాజకీయ పార్టీల అభిప్రాయాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుసుకున్నారు. తాము ఎన్నికల నిర్వహణ విషయంలో ఉత్తమమైన పద్దతుల్ని పాటిస్తున్నామని ఆయన చెబుతున్నారు. మూడు రోజుల కిందట.. ఎన్నికల నిర్వహణపై… సీఎంవో ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాష్ సమీక్షా సమావేశం పెట్టాలనుకున్నారు. దానిపై.. నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సారీ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ద‌ర్శ‌కేంద్రుడితో… స‌మంత‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌

కె.రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయ‌న త‌న‌లోని కొత్త కోణాన్నిచూపించ‌బోతున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయిక‌లు...

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

HOT NEWS

[X] Close
[X] Close