నాని కెరీర్‌లో ఇదే ఫ‌స్ట్ టైమ్‌… మ‌రి ఏమ‌వుతుందో?

తెలుగులో, ఈ మ‌ధ్య‌కాలంలో వ‌రుస‌గా ఆరు హిట్లు కొట్టిన హీరో నానినే! ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌, మ‌జ్ను, జెంటిల్‌మెన్‌, నేను లోక‌ల్‌.. ఇలా నాని ముట్టుకొన్న సినిమా హిట్ట‌యి కూర్చుంది. అందుకే నాని క్రేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్‌, పారితోషికం అన్నీ పెరిగిపోయాయి. నాని నుంచి సినిమా వ‌స్తోందంటే, హిట్ట‌వ్వ‌డం ఖాయం అనే భ‌రోసా నానాటికీ పెరిగిపోతోంది. నాని ప్ర‌తీ సినిమా పాజిటీవ్ టాక్‌తోనే విడుద‌లైంది. సినిమా కాస్త అటూ ఇటూగా ఉన్నా, అంచ‌నాల‌కు కాస్త ద‌గ్గ‌ర్లో ఆగిపోయినా.. ఆ పాజిటీవ్ టాక్ సినిమాని ఇంకాస్త ముందుకు నెట్టేసేది. అయితే…. ఫ‌స్ట్ టైమ్ త‌న కెరీర్‌లో కాస్త నెటిటీవ్ టాక్‌తో ఓ సినిమా విడుదల అవుతోంది.. అదే `నిన్ను కోరి`. ఈ సినిమాలోని పాట‌లు, ప్ర‌చార చిత్రాలు ఓకే అనిపించాయి. కాక‌పోతే… నెగిటీవ్ టాక్ భ‌య‌పెడుతోంది. నాని నుంచి ఆశించే వినోదం ఈ సినిమాలో లేద‌ని, సెకండాఫ్ డ‌ల్‌గా ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. రెండు మూడు తెలుగు సినిమాల్ని గుర్తు చేసేలా క‌థ సాగింద‌ట‌. `హ‌మ్ ఆప్‌కే హై కౌన్‌` అనే హిందీ సినిమాని కాపీ కొట్టార‌న్న వార్త‌లూ వినిపిస్తున్నాయి. ఏదైతేనేం.. నాని క్రేజ్ అద్భుతంగా ఉంది. తన కెరీర్‌లోనే పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. ఈసినిమాకి అవ్వాల్సిన బిజినెస్ ఎప్పుడో అయిపోయింది. ఎలాగూ ఓపెనింగ్స్ అదిరిపోతాయ్‌. ఇవి చాల‌వూ.. ఈ సినిమాని గ‌ట్టెక్కించ‌డానికి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.