ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ, అందరు మనుషుల మధ్యా ఉన్నట్టుగానే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎక్కువ శాతం బంధాలన్నీ కూడా మనీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది మధ్య మాత్రం నిజమైన బంధాలుంటాయి. అలాంటి బంధాలను ఎక్కువ సంఖ్యాలో కలిగి ఉన్నవాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి కూడా శ్రీకాంత్, రవితేజ, లారెన్స్‌లతో పాటు ఇంకా చాలా మందినే ఎంకరేజ్ చేశాడు, అలాగే మెగాస్టార్ పేరును వాడుకుని పైకొచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. కానీ మెగాస్టార్‌తో పాటు మిగతా స్టార్ హీరోస్లో చాలా మందికి లేని రిలేషన్స్ మాత్రం పవన్‌కి ఉన్నాయి. మరీ ముఖ్యంగా నితిన్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో పవన్ రిలేషన్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పవన్ కళ్యాణ్‌తో క్లోజ్ అయిన తర్వాత నుంచీ తన డైరెక్షన్ కెరీర్‌తో పాటు పవన్ స్థాపించిన పొలిటికల్ పార్టీ కోసం కూడా తెరవెనుక చాలా ఎక్కువ కష్టపడుతున్నాడు త్రివిక్రమ్. చాలా మందికి తెలియదు కానీ జనసేన పార్టీ పాటలన్నీ కూడా త్రివిక్రమ్ సారధ్యంలోనే తయారవుతున్నాయి.
పవర్ స్టార్, త్రివిక్రమ్‌లు అంటే హీరో-డైరెక్టర్ కాబట్టి ఒకరికొకరు పోటీ కాదు కనుక, అలాగే ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం వెరీ కామన్. అలాగే ఇద్దరి ఆలోచనలు కూడా చాలా వరకూ ఒకేరకంగా ఉంటాయి. అందుకే నితిన్-పవన్‌ల రిలేషన్ మాత్రం అంతకంటే కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో సింగిల్ హిట్ కొట్టిన హీరోలు కూడా మహేష్ బాబు, పవన్‌లకు నాకూ ఏమీ తేడాలేదు అని మాట్లాడేస్తూ ఉంటారు. ఎన్టీఆర్, ప్రభాస్‌ల మొదటి సినిమాల కంటే నా మొదటి సినిమానే పెద్ద హిట్ అని కూడా డప్పాలు కొట్టేవాళ్ళు చాలా మందే ఉంటారిక్కడ. రెగ్యులర్‌గా కామెడీ వేషాలేస్తూ ఉండే ఓ కమెడియన్‌తో ఓ సారి మాట్లాడుతూ ఉన్నప్పుడు…‘నేను నటించిన ఫలానా సినిమాలో ఆ షాకింగ్ ఎక్స్ప్రెషన్ కమల్ హాసన్కంటే బెటర్‌గా ఇచ్చాను కదా…’ అని అన్నాడు. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. అలా ఉంటుంది సినిమా వాళ్ళ వ్యవహారం. మామూలు వాళ్ళకే కాస్త ఇగో ఉంటుంది. ఇక హీరో అంటే చెప్పేదేముంది. కానీ పవన్ కళ్యాణ్ విషయం వరకూ మాత్రం తానుకూడా హీరోనే అన్న విషయం మర్చిపోతాడు నితిన్. ఎన్ని సార్లైనా, ఎంతసేపైనా పవన్ గొప్పదనం గురించి మాట్లాడుతూనే ఉండడానికి నితిన్ రెడీ. అలాగే 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు పవన్‌ని అభిమానించే చాలా మంది సినిమా వాళ్ళు పవన్ స్పీచ్ సూపర్, బాగా మాట్లాడాడు అని పొగిడేశారు. కానీ పవన్ వెంట నడుస్తామన్న మాట మాత్రం ఎవ్వరూ చెప్పలేదు. నటుడిని అభిమానిస్తే పెద్దగా నష్టమేం ఉండదు కానీ ఏదో ఒక పార్టీని, నాయకుడిని అభిమానిస్తే వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నితిన్‌కి కూడా ఆ విషయం తెలుసు. మోరోవర్ పవన్‌ని సీమాంధ్రుడిగా చిత్రించడానికి తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్స్‌లా ఫీల్ అయిపోతున్న టీఆర్ఎస్ నాయకులు గట్టి ప్రయత్నాలే చేశారు. అయినప్పటికీ నితిన్ మాత్రం చాలా ఓపెన్‌గానే పవన్‌తో కలిసి నడవడానికి నేను రెడీ అని చెప్పేశాడు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో తన తండ్రి సుధాకరరెడ్డి ద్వారా నితిన్ చేస్తున్న సాయం, అలాగే నితిన్ సినిమాలు, కెరీర్ కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న హెల్ప్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? నితిన్‌ని ఎంకరేజ్ చేస్తున్న స్థాయిలో మెగా హీరోలెవ్వరినీ పవన్ సపోర్ట్ చేయడం లేదని మెగా అభిమానులు బాధపడుతూ ఉన్నారంటేనే పవన్ సాయం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
ఇక రీసెంట్గా జరిగిన అఖిల్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కి అటెండ్ అయిన నితిన్‌ని చూసి అక్కడున్నవాళ్ళు షాకయ్యారు. పవన్ కళ్యాణ్ స్టైల్లోనే గెడ్డం పెంచిన నితిన్, పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ పొలిటికల్ కాస్ట్యూమ్స్‌లో సేం టు సేం పవన్ స్టైల్లోనే ఎంట్రీ ఇచ్చాడు నితిన్. అలాంటి పవన్ గెటప్‌లో నితిన్‌ని చూసినవాళ్ళందరూ కూడా ‘పవన్ కళ్యాణ్ అసలైన భక్తుడంటే నితినేనబ్బా…’ అని కామెంట్స్ పాస్ చేశారు.