మాచ‌ర్ల‌… బ‌డ్జెట్ దాటేసిందా?

ఈమ‌ధ్య చాలా సినిమాలు బ‌డ్జెట్ స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్నాయి. ముందు అనుకొన్న బ‌డ్జెట్ ఒక‌టి. చివ‌రికి అయ్యేది ఇంకొక‌టి. పాన్ ఇండియా మార్కెట్ వ‌ల్ల‌, డిజిట‌ల్ మార్కెట్ పెర‌గ‌డం, ఓటీటీ రూపంలో డ‌బ్బులు దండిగా రావ‌డంతో… బ‌డ్జెట్ పెరిగినా ఫ‌ర్వాలేద‌నుకొంటున్నారు. దాంతో.. లెక్క‌లు త‌ప్పుతున్నాయి. తాజాగా నితిన్ సినిమాకీ ఇదే ప‌రిస్థితి ఎదురైంది. నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`. ఈ సినిమాని నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్‌నే తెర‌కెక్కిస్తోంది. సొంత సినిమా అనేస‌రికి హీరోలు పొదుపుగా వ్య‌వ‌హ‌రిస్తారు. వీలైనంత తక్కువ‌లో సినిమా తీయాల‌ని అనుకొంటారు. కానీ ఈ సినిమా విష‌యానికొస్తే సీన్ రివ‌ర్స్ అయ్యింది. ముందు అనుకొన్న బ‌డ్జెట్ కంటే 30 శాతం ఖ‌ర్చు పెరిగిపోయింది. దానికి ర‌క‌రకాల కార‌ణాలున్నాయి. ద‌ర్శ‌కుడికి ఇదే తొలి సినిమా. మేకింగ్ ప‌రంగా.. కొన్ని స‌మ‌స్య‌లు ఉంటాయి. బెట‌ర్ మెంట్ కోసం రీషూట్లు చేయ‌డం వ‌ల్ల కూడా బ‌డ్జెట్ అదుపు త‌ప్పింద‌ని తెలుస్తోంది. `మాచ‌ర్ల‌..`పై నితిన్ గ‌ట్టిగా న‌మ్మ‌కాలు పెట్టుకొన్నాడు. సొంత బ్యాన‌ర్‌లో వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి.. ఇంకాస్త కేర్ పెరిగింది. అందుకే.. బ‌డ్జెట్ పెరిగినా నితిన్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని టాక్‌. ఎంత ఖ‌ర్చు పెట్టి తీసినా, సినిమా బాగుంటే చాలు అనుకొంటున్నాడ‌ట‌. మ‌రి ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close