నితిన్ సినిమా ఏమైంది..?!

మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ త‌ర‌వాత నితిన్ మ‌రో సినిమా మొద‌లెట్ట‌లేదు. అయితే `మాచ‌ర్ల‌..` విడుద‌ల‌కు ముందే వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి క్లాప్ కొట్టారు. ఓ పాట‌ని కూడా ఫారెన్ లో చిత్రీక‌రించారు. అయితే ఆసినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. ఆగ‌స్టులో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వ్వాల్సింది. కానీ జ‌ర‌గ‌లేదు. దీనికి చాలా చాలా కార‌ణాలున్నాయి.

`మాచ‌ర్ల‌..` దెబ్బ కొట్ట‌డంతో స్క్రిప్టు విష‌యంలో నితిన్ చాలా ప‌ట్టుతో ఉన్నాడట‌. ఎలాంటి డౌటూ లేకుండా చేతికి ప‌క్కాగా స్క్రిప్టు వ‌చ్చిన‌ప్పుడే… షూటింగ్ మొద‌లెడ‌దామ‌ని చెప్పాడ‌ట‌. పైగా వ‌క్కంతం సినిమాకి సంబంధించి సెకండాఫ్‌లో కొన్ని ఇబ్బందులు ఏర్ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. దాంతో.. వ‌క్కంతం ఇప్పుడు స్క్రిప్టుని ఇంకాస్త టైట్ చేస్తూ రాస్తున్నాడ‌ని స‌మాచారం. నితిన్ సినిమాలో విల‌న్ పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంది. దానికి ప‌వ‌ర్ ఫుల్ న‌టుడు కావాలి. స‌రైన విల‌న్‌ని వెదికి ప‌ట్టుకోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. విల‌న్ దొరికితే.. ఈ సినిమా సెట్ట‌యిపోయిన‌ట్టే. అందుకే నితిన్ సినిమా లేట‌వుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆమ్ ఆద్మీలా బీఆర్ఎస్ జాతీయ స్థాయికి వెళ్లగలదా !?

గుజరాత్‌లో ఐదు అసెంబ్లీ సీట్లను సాధించిన ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ గుర్తింపు లభించింది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉంది. గుజరాత్‌లో ఆరు కన్నా ఎక్కువ శాతం ఓట్లు...

ప్రతీ యాభై ఇళ్లకు వైసీపీ తరపున ఇంకొకరు నిఘా !

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల పేరుతో ప్రభుత్వం పన్నులుగా కట్టిన సొమ్మును ఇస్తూ.. ప్రతి యాభై ఇళ్లకు ఓ వ్యక్తిని నియమించింది. వారికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ఆ...

“వారాహి” రంగు మార్చక తప్పదా !?

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి హాట్ టాపిక్ అయింది. యుద్ధ ట్యాంక్‌ను పోలి ఉండటం.. సేనాని ఎన్నికల యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఉండటంతో ఈ వాహనం పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే...

ముద్ర పడింది – టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్థానం అయిపోయింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. దసరా రోజున టీఆర్ఎస్ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తూ లేఖ పంపింది. కేసీఆర్ ఈ లేఖను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close