ఇంతకీ లాయర్లకు ఏపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చెంత!?

కింది కోర్టుల, జిల్లా కోర్టులు, సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా న్యాయస్థానాలన్నింటిలో ఏపీ ప్రభుత్వ కేసులు వందలు, వేలల్లో ఉంటాయి. కింది స్థాయిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకుంటారు. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో అయితే ప్రత్యేకంగా ఫీజులు కట్టి లాయర్లను మాట్లాడుకోవాలి. ఏపీ ప్రభుత్వం కొన్ని సార్లు కింది స్థాయి కోర్టుల్లో వాదించడానికి కూడా సుప్రీంకోర్టు లాయర్లను తీుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ అంశంపై తరచూ చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వం లాయర్ల కోసం వెచ్చించిన మొత్తాన్ని తెలుసుకునేందుకు నోటీసులు ఇస్తామని చెప్పడంతో అసలు ప్రభుత్వం పెట్టిన ఖర్చెంత అన్నదానిపై చర్చ ప్రారంభమయింది.

సుప్రీంకోర్టు ఒక్క పోలవరం అంశంపైనే నోటీసులు ఇస్తామని చెప్పింది కానీ ఇతర కేసుల్లో లాయర్లను మాట్లాడుకునే విషయంలో కాదు. అందుకే ఇతర కేసుల్లో లాయర్లకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోందనేది పెద్ద మిస్టరీ. సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లు గంటల్లో చార్జ్ చేస్తారు. అది లక్షల్లో ఉంటుంది. సీనియర్ లాయర్లను.. ప్రసిద్ధి చెందిన వారిని ఏపీ ప్రభుత్వం మాట్లాడుకుంటూ ఉంటుంది. చివరికి రఘురామ రాజును సీఐడీ అధికారులు కొట్టిన కేసుల్లాంటి వాటిలోనూ పెద్దపెద్ద లాయర్లను మాట్లాడుకోవడం గతంలో సంచలనం సష్టించింది. అమరావతి కేసులను వాదించడానికి ఏకంగా ఓ సారి రూ. ఐదు కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాత లాయర్ల ఫీజులకు కోట్లకు కోట్లు విడుదల చేశారు. కానీ చాలా వరకూ గోప్యంగా ఉండిపోయాయి.

ఒక్క పోలవరం ఇష్యూలోనే లాయర్లకు రూ. వంద కోట్ల వరకూ ఖర్చు పెట్టి ఉంటారని పిటిషనర్ తరపు లాయర్.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా అక్కడి లాయరే కాబట్టి.. ఏదో సమాచారం ఉండే ఉంటుంది.. లేకపోతే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందే వాదించరు. గతంలో అమరావతి కేసుల్లో తమ తరపున వాదించడమే కాకుండా..రైతుల తరపున వాదించకుండా ఉండటానికి ఇతర లాయర్లకు ఫీజులు చెల్లించారన్న ఆరోపణలువచ్చాయి. ఢిల్లీ న్యాయవర్గాల్లో ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలి… సీఎం తీరు మొదటి నుంచి చర్చనీయాంశమే. ఇప్పుడు ఈ విషయం .. మరింత హాట్ టాపిక్ అవుతుంది.

సుప్రీంకోర్టు అడిగినా..,ప్రభుత్వం లెక్కలు చెప్పదు. ఇప్పటి వరకూ జరిగింది అదే. ప్రభుత్వం మారితే.. మొత్తం ఆడిట్ చేయించి… లెక్కలు బయటపెడితే కానీ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఘనకార్యాల గురించి బయటకు తెలియదు. కొసమెరుపేమిటంటే.. జగన్ తరపున వ్యక్తిగతంగా అక్రమాస్తుల కేసులు వాదించే లాయర్‌ ఇప్పుడు వైసీపీ తరపున రాజ్యసభ సభ్యునిగా ఏపీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close