నితిన్ – విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే పేరు దాదాపు ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నితిన్ – పూజా కలిసి నటించడం ఇదే తొలిసారి. ఈ మేరకు పూజాతో చిత్రబృందం సంప్రదింపులు మొదలెట్టినట్టు తెలుస్తోంది.
నితిన్ – విక్రమ్ కాంబో నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్లో ఇది వరకు ‘ఇష్క్’ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, వరుస ఫ్లాపులలో ఉన్న నితిన్‌కు గట్టి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. తనకు విక్రమ్ మళ్లీ బూస్టప్ ఇస్తాడన్నది అందరి ఆశ.
ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో నడిచే కథ. నితిన్ హార్స్ రైడర్‌గా కనిపించబోతున్నాడు. అందుకోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకొంటున్నాడు. ఈ సినిమాకు ‘స్వారీ’ అనే పేరు పరిశీస్తున్నారు. కథ లాక్ అయిపోయినట్టే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలెడతారు.