రాను రాను సంక్రాంతి సీజన్ కూడా పుష్పక విమానం లా తయారైపోతోంది. పెద్ద హీరోలు, మీడియం రేంజ్ స్టార్లు, చిన్న హీరోలు కూడా సంక్రాంతికే గురి పెడుతున్నారు. 2027 సంక్రాంతికి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు రాబోతున్నాయి. పవన్ కల్యాణ్ సినిమా కూడా లైన్ లో ఉంది. తేజా సజ్జా, శర్వానంద్ సినిమాలూ సంక్రాంతి కే వస్తాయని టాక్. ఇప్పుడు నితిన్ కూడా రెడీ అయిపోతున్నాడు.
నితిన్ హీరోగా ‘ఆయ్’ ఫేమ్ అంజి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. శ్రేష్ట్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే టైటిల్ అనుకొంటున్నారు. సంక్రాంతికే ఈ సినిమాని విడుదల చేస్తారు. నితిన్ ఈమధ్య కాలంలో ఓకే చేసిన స్క్రిప్టు ఇది. సంక్రాంతి లక్ష్యంగా ఈ సినిమా బరిలోకి దించుతున్నారు. టైటిల్ లోనే సంక్రాంతి వైబ్ ఉన్న సినిమా ఇది. సంక్రాంతికి రిలీజ్ చేయడమే బెటర్. కాకపోతే ఓ వైపు దిగ్గజాలు బరిలోకి దిగుతున్న వేళ… నితిన్ సినిమా కూడా లైన్లో పెట్టడం చాలా పెద్ద రిస్క్. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ లు ఉన్నప్పుడు మరో సినిమా వైపు దృష్టి నిలుస్తుందా అనేది సందేహం. ఇప్పటికి చూస్తున్న లిస్టు ప్రకారం 2027 సంక్రాంతికి ఏడెనిమిది సినిమాలు రెడీ అవుతాయి. ఇన్ని సినిమాలకు స్పేస్ ఉంటుందా, లేదా అనేది నిర్మాతలు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
