సావిత్రి దొరికేసింది

మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ సినిమాగా రాబోతోంది. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో ఆక‌ట్టుకొన్న నాగ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. అశ్వ‌నీద‌త్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. సావిత్రి పాత్ర కోసం అర‌డ‌జ‌ను హీరోయిన్ల పేర్లు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. అనుష్క‌, విద్యాబాల‌న్, ప‌రిణితీ చోప్రా ఇలా చాలామంది పేర్లు అనుకొన్నారు. చివ‌రికి ఆ ఛాన్స్ నిత్య‌మీన‌న్‌కి ద‌క్కిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల నాగ్ అశ్విన్‌, అశ్వ‌నీద‌త్ ఇద్ద‌రూ నిత్య‌ని క‌ల‌సి క‌థ వినిపించార్ట‌. ఈచిత్రంలో న‌టించ‌డానికి నిత్య కూడా అంగీక‌రించింద‌ని స‌మాచారం. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో తెర‌కెక్కించే ఈ చిత్రాన్ని హిందీలోకీ తీసుకెళ్లాల‌న్న ఆలోచ‌న ఉంది. 2016 చివ‌ర్లో ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. 2017 వేస‌వికి విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. సావిత్రి జీవితంలో తెలియ‌ని కోణాల్ని సృశిస్తూ సాగే ఈ చిత్రంలో ఇంకొంత‌మంది స్టార్ హీరోలు అతిథి పాత్ర‌లు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. బ‌యోపిక్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న ఈ కాలంలో… సావిత్రి జీవిత క‌థ‌ని ఎలా తెర‌కెక్కిస్తారో, ఆ చిత్రం ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com