ప‌వ‌న్ ఎంట్రీ.. ఈసారి నిత్య‌మీన‌న్ కూడా!

టాలీవుడ్ మ‌ళ్లీ షూటింగుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. సుదీర్ఘ విరామం త‌ర‌వాత‌.. స్టార్స్ అంతా సెట్స్ బాట ప‌ట్టారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అతి త్వ‌ర‌లోనే… మేక‌ప్ వేసుకోబోతున్నారు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం `వీర‌మ‌ల్లు`తో పాటు `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 12 నుంచి `అప్ప‌య్య‌యుమ్‌` కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. 12నే ప‌వ‌న్ కూడా సెట్స్ లోకి వ‌స్తున్నాడ‌ట‌. ప‌వ‌న్ కి తోడుగా ఈసారి నిత్య‌మీన‌న్ కూడా రాబోతోంది. ఈ రీమేక్ లో నిత్య‌మీన‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలిసారి తాను కూడా సెట్స్‌లోకి అడుగుపెట్ట‌బోతోంది. 12 నుంచి 18 వ‌ర‌కూ సాగే ఈ షెడ్యూల్ లో.. ప‌వ‌న్‌, నిత్య‌ల‌పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఈ సినిమా కోసం `ప‌ర‌శురామ కృష్ఱ‌మూర్తి` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ సినిమాకి ఇదే టైటిల్ అని.. ప్రచారం జ‌రుగుతోంది. అయితే.. చిత్ర‌బృందం టైటిల్ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే స‌మ‌కూరుస్తున్న విష‌యం తెలిసిందే. టైటిల్ బాధ్య‌త కూడా ఆయ‌నపూనే ఉంది. త్రివిక్ర‌మ్ కి `అ` సెంటిమెంట్ ఉంది. ఆ అక్ష‌రంతో మొద‌ల‌య్యే టైటిల్ కోసం ఆయ‌న అన్వేష‌ణ మొద‌లెట్టార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close