బీహార్లో ఎన్డీఏ కూటమి గెలిచినా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అవుతారా లేదా అన్నదానిపై అనుమానాలకు తెరపడుతోంది. నితీష్ కుమార్నే కూటమి పార్టీలు సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయనున్నాయి. నిజానికి బీజేపీకి పది అసెంబ్లీసీట్లు.. జేడీయూ కంటే ఎక్కువగానే వచ్చాయి. అయినా బీజేపీ సీఎం పదవిని నితీష్ కే ఆఫర్ చేసింది. గతంలో నితీష్ ను తీవ్రంగా వ్యతిరేకించిన ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ కూడా నితీశ్ సీఎం కు అంగీకారం తెలిపారు.
నితీష్ సీఎంగా ఉండకపోవచ్చునని ప్రచారం జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన వయసు, ఆరోగ్యం అందులో ప్రధానమైనది. నితీష్ కుమార్ ఆరోగ్య ఏమంత గొప్పగా లేదని ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తున్న విధానం వైరల్ గా మారుతూ వస్తోంది. అందుకే ఆయనను పక్కన పెడతారని అనుకున్నారు. కానీ మోదీ ఎన్నికల ప్రచారంలో మరోసారి నితీశ్ సీఎం అవుతారని ప్రకటించారు. ఆ ప్రకారం ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
19 లేదా 20 వ తేదీన ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. నేతలంతా హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంలో నితీష్ ది ప్రత్యేకమైన రికార్డు. ఇప్పుడు పదో సారి ప్రమాణం చేస్తున్నారు. 19 ఏళ్లు సీఎంగా ఉన్నారు. ఒక్కో టర్మ్ లో రెండు సార్లు కూటములు మార్చి ప్రమాణం చేయండి ఆయన ప్రత్యేకత.
