త్రివిక్ర‌మ్ + లోకేష్ క‌న‌క‌రాజ్ = విశ్వ‌క్‌సేన్‌

విశ్వ‌క్‌సేన్‌కి క‌థానాయిక నివేదా పేత‌రాజ్ ఓ మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. విశ్వ‌క్‌లో అటు త్రివిక్ర‌మ్‌, ఇటు లోకేష్ క‌న‌క‌రాజ్ ఉన్నార‌ని తెగ పొగిడేసింది. విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘దాస్ కా ధ‌మ్కీ’. ఇందులో నివేదా హీరోయిన్‌. దాస్‌కా ద‌మ్కీ ప్ర‌మోష‌న్ల‌లో నివేదా విరివిగా పాల్గొంటోంది. ఈ సంద‌ర్భంగా త‌న ద‌ర్శ‌కుడ్ని, హీరోనీ ఆకాశానికి ఎత్తేస్తోంది. సెట్లో… విశ్వ‌క్‌ని చూస్తుంటే త‌న‌కు త్రివిక్ర‌మ్ గుర్తొస్తార‌ని, విశ్వ‌క్ కూడా సెట్లో త్రివిక్ర‌మ్ లా ఎన‌ర్జిటిక్‌గా ఉంటాడ‌ని పొగిడేసింది నివేదా. అంతే కాదు.. విశ్వ‌క్ ద‌గ్గ‌ర చాలా మంచి క‌థ‌లు ఉన్నాయ‌ని, వేరే హీరోతో సినిమా చేస్తే, నెక్ట్స్ లెవ‌ల్లో ఉంటుంద‌ని, ముఖ్యంగా గ్యాంగ్ స్ట‌ర్ క‌థ‌లు విశ్వ‌క్ బాగా డీల్ చేస్తాడ‌ని, ఒక‌వేళ విశ్వ‌క్ గ్యాంగ్ స్ట‌ర్ సినిమా తీస్తే… లోకేష్ క‌న‌క‌రాజ్ స్థాయిలో సినిమాని తీర్చిదిద్దుతాడ‌ని చెప్పుకొచ్చింది.

విశ్వ‌క్ ఏ హీరోతో సినిమా తీస్తే బాగుంటుంద‌న్న విష‌యంలో.. ఓ స‌ల‌హా కూడా ఇచ్చింది. బాల‌య్య‌తో విశ్వ‌క్ కాంబో బాగుంటుంద‌ని చెప్పింది. బాల‌య్య మాస్ హీరో అని, త‌న‌ని విశ్వ‌క్ బాగా చూపించ‌గ‌ల‌డ‌ని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది. బాల‌కృష్ణ హీరోగా విశ్వ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంద‌ని ఇటీవ‌ల వార్త‌లొచ్చాయి. అందుకే… నివేదా కూడా ముంద‌స్తు హింట్ ఇచ్చిందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడి ‘ఎస్‌.. బాస్‌’

పిల్ల‌జ‌మిందార్‌, భాగ‌మ‌తి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు అశోక్. ఆ త‌ర‌వాత‌.. అశోక్ ఓ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి అశోక్ ఏం చేస్తున్నాడు? త‌న త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనే...

దక్షిణాదిలో తగ్గిపోయే లోక్‌సభ సీట్లపై కేటీఆర్ ఆందోళన!

దక్షిణాదికి దేశంలో ప్రాధాన్యం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్ సభ సీట్లను తగ్గించబోతున్నారని చాలా కాలంగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2026వ...

రైతు భరోసా క్యాలెండర్ తప్పింది !

జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసినా సంక్షేమ క్యాలెండర్ ను మాత్రం వదిలి పెట్టకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది కూడా దారి తప్పుతోంది. చెప్పిన...

బింబిసార-2కి కొత్త దర్శకుడు?

కల్యాణ్‌ రామ్‌ సోషియో ఫాంటసీ 'బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మళ్ళీ జోష్ తెచ్చింది. దీనికి పార్ట్ 2 వుంటుందని సినిమా ముగింపులోనే చెప్పారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close