కృష్ణ‌వంశీకి హ్యాండిచ్చిన ప్ర‌కాష్ రాజ్‌

డూ ఆర్ డై ప‌రిస్థితుల్లో కృష్ణ‌వంశీ తీసిన సినిమా రంగ‌మార్తాండ‌. ఈ సినిమా అనుకొన్న‌ప్ప‌టి నుంచీ క‌ష్టాలే. అనుకొన్న బ‌డ్జెట్‌లో, అనుకొన్న స‌మ‌యానికి సినిమా పూర్తి కాలేదు. నిర్మాత‌లు మారారు. రిలీజ్ డేట్ కోసం ఎదురు చూడాల్సివ‌చ్చింది. మ‌ధ్య‌లో ప్ర‌కాష్ రాజ్‌కీ, కృష్ణ‌వంశీకీ మ‌ధ్య లుక‌లుక‌లు వ‌చ్చాయి. వాటిని దాటుకొని ఈ సినిమా పూర్తి చేశాడు కృష్ణ‌వంశీ. ఉగాది రోజున సినిమా విడుద‌ల కాబోతోంది. కృష్ణ‌వంశీ చాలా ప్రేమించి తీసిన సినిమా ఇది. అందుకే ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకొన్నాడు. ప్రెస్ మీట్లూ, ప్రీ రిలీజ్ ఈవెంట్లూ లేకుండానే ఈ సినిమాపై పాజిటీవ్ బ‌జ్ తీసుకుని రావ‌డానికి ప్రివ్యూలు ప్లాన్ చేశాడు. దానికి మంచి స్పంద‌న వచ్చింది. సినిమా చూసిన‌వాళ్లంతా అద్బుతంగా ఉంద‌ని మెచ్చుకొంటున్నారు. కానీ.. ప్రివ్యూలు మిన‌హా ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ లేవు. దానికి కార‌ణం.. ప్ర‌కాష్‌రాజ్‌కీ, కృష్ణ‌వంశీకి మ‌ద్య గ్యాప్ ఇంకా సెట్ కాక‌పోవ‌డ‌మే. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు రాన‌ని ప్ర‌కాష్ రాజ్ చెప్పేశాడ‌ట‌. ప్ర‌కాష్ రాజ్ లేకుండా ప్ర‌మోష‌న్లు ఎలా చేస్తారు? అందుకే కృష్ణ‌వంశీ దాని జోలికి వెళ్ల‌కుండా కేవ‌లం ప్రివ్యూల‌తోనే స‌రిపెట్టాడు.

ప్ర‌కాష్ రాజ్‌కీ కృష్ణ‌వంశీకి మ‌ద్య గ్యాప్ రావ‌డం ఇదే తొలిసారి కాదు. గోవిందుడు అంద‌రివాడేలేకి ముందు ఇదే జ‌రిగింది. కానీ చిరంజీవి కోసం ఆ సినిమాకి క‌లిసి ప‌నిచేశారు. ఇప్పుడు రంగ‌మార్తండ తీశారు. రంమార్తండ స‌గం సినిమా పూర్త‌య్యేంత వ‌రకూ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం బాగానే ఉండేది. కానీ, ఆ సినిమా ఆర్థిక ప‌ర‌మైన లావాదేవీల విష‌యంలో ఇద్ద‌రికీ బేధాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని టాక్‌. అందుకే ప్ర‌కాష్ రాజ్ ఈ సినిమాని ప‌ట్టిచుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడి ‘ఎస్‌.. బాస్‌’

పిల్ల‌జ‌మిందార్‌, భాగ‌మ‌తి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు అశోక్. ఆ త‌ర‌వాత‌.. అశోక్ ఓ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి అశోక్ ఏం చేస్తున్నాడు? త‌న త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనే...

దక్షిణాదిలో తగ్గిపోయే లోక్‌సభ సీట్లపై కేటీఆర్ ఆందోళన!

దక్షిణాదికి దేశంలో ప్రాధాన్యం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్ సభ సీట్లను తగ్గించబోతున్నారని చాలా కాలంగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2026వ...

రైతు భరోసా క్యాలెండర్ తప్పింది !

జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసినా సంక్షేమ క్యాలెండర్ ను మాత్రం వదిలి పెట్టకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది కూడా దారి తప్పుతోంది. చెప్పిన...

బింబిసార-2కి కొత్త దర్శకుడు?

కల్యాణ్‌ రామ్‌ సోషియో ఫాంటసీ 'బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మళ్ళీ జోష్ తెచ్చింది. దీనికి పార్ట్ 2 వుంటుందని సినిమా ముగింపులోనే చెప్పారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close