షార్ట్ ఫిల్మ్స్ చేస్తానంటున్న క‌థానాయిక‌

కొంత‌మంది హీరోల‌కు ఉన్న‌ట్టే.. కొంత‌మంది హీరోయిన్లూ డెర‌క్ష‌న్‌పై గురి ఉంది. నిత్య‌మీన‌న్ మెగాఫోన్ ప‌ట్టాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటోంది. ఈమ‌ధ్య నివేదా థామ‌స్ కూడా ద‌ర్శ‌క‌త్వ‌పు క‌ల‌లు కంటోంది. `నేను ద‌ర్శ‌కురాలినవుతా` అంటూ ఈమ‌ధ్య ప్ర‌క‌టించింది నివేదా. ఆ ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కూ వ‌చ్చాయి అని అడిగితే… ”నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తా అన‌గానే నిర్మాత‌లు రెడీ అయిపోరు క‌దా. నా అవ‌కాశాల్ని నేనే సంపాదించుకోవాలి. ముందు షార్ట్ ఫిల్మ్స్ చేస్తా. ద‌ర్శ‌కురాలిగా నేనేంటి? ఏం చేయ‌గ‌ల‌ను? అనే విష‌యాల్ని షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప‌రీక్షించుకుంటా. ఆ త‌ర‌వాతే.. సినిమా ద‌ర్శ‌క‌త్వం గురించి ఆలోచిస్తా. ఈలోగా… నేను హీరోయిన్ గా చేస్తున్న ప్రాజెక్టులు కొన్నున్నాయి. అవి పూర్తి చేయాలి. కొన్ని క‌థ‌లు కూడా సిద్ధం చేసుకుంటున్నా” అంటోంది. తాను న‌టించిన `వి` సెప్టెంబ‌రు 5న అమేజాన్ లో విడుద‌ల అవుతోంది. ఈ సినిమాపైచాలా ఆశ‌లు పెట్టుకుంది నివేదా. ఇందులో ఓ న‌వ‌లా ర‌చ‌యిత్రిగా క‌నిపించ‌బోతోంది. ”ఈ సినిమాలో అపూర్వ అనే పాత్ర‌లో క‌నిపిస్తా. న‌వ‌లా ర‌చ‌యిత్రిని. నా పాత్ర నాకు బాగా న‌చ్చింది. విన‌యంతో పాటు.. దూకుడు స్వ‌భావం గ‌ల పాత్ర అది. మీకూ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది” అని చెప్పుకొచ్చింది నివేదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close